Pawan Kalyan: హుటాహుటిన ఢిల్లీకి పవన్.. కేంద్ర పెద్దలతో మంతనాలు.. పొత్తులపై మరింత క్లారిటీ

Pawan Kalyan: ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయంగా స్పీడ్ పెంచారు. జనసేనను బరపించేందుకు, వచ్చే ఎన్నికల్లో సత్తా చాటేందుకు, జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు పవన్ అనుసరిస్తున్న వ్యూహం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. తన వ్యాఖ్యలు, నిర్ణయాలతో ఏపీ రాజకీయాల్లో పవన్ హీట్ పుట్టిస్తున్నారు. వైసీపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడటం, టీడీపీ అధినేత చంద్రబాబుతో కలవడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు దారి తీస్తోంది. పవన్, చంద్రబాబు కలవడంతో వైసీపీ అప్రమత్తమైంది. వైసీపీ నేతల్లో కలవరం మొదలైంది. ఆ రెండు పార్టీలు కలవకడంతో ఏపీ రాజకీయ ముఖచిత్రం మారుతోంది.

అయితే టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి తర్వాతి రోజే ఢిల్లీకి పవన్ పయనమవ్వడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో పవన్ ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణతో పాటు జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ ఎయిర్ పోర్ట్ లో కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అర్జంట్ గా కలవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి పవన్ కు పిలుపు వచ్చిందని, ప్రత్యేక విమానం కూడా ఏర్పాటు చేశారని చెబుతున్నారు. పవన్, చంద్రబాబు భేటీపై కేంద్ర బీజేపీ ఆరా తీస్తోంది. ఆ భేటీకి సంబంధించి వివరాలను తెప్పించుకుని కేంద్ర పెద్దలు అంచనాలు వేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

ఇక ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు కూడా ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ పెద్దలను కలిసి చంద్రబాబు, పవన్ భేటీ గురించి వివరాలను అందించారు. చంద్రబాబు, పవన్ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు తెప్పించుకున్న కేంద్ర బీజేపీ.. ఏపీలో భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చలు జరుపుతోంది. ఎవరితో కలిసి ముందుకెళ్లాలి.. ఎలాంటి వ్యూహం అనుసరించాలనే దానిపై రాష్ట్ర నేతల అభిప్రాయాలను కోరుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. జగన్ తో కలిసి ఉండాలా.. లేక.. టీడీపీ, పవన్ కూటమిలో కలవాలా అనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. ప్రస్తుతం జగన్, చంద్రబాబులిద్దరికీ సమాన దూరంలో బీజేపీ ఉన్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీకి సపోర్ట్ చేసిన బీజేపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత దూరం పాటిస్తోంది.

కానీ బీజేపీకి అన్ని విషయాల్లో జగన్ సపోర్ట్ చేస్తున్నారు. ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి ఎన్నికల్లో అడగకుండా మద్దతు ఇచ్చారు. బీజేపీ కూడా కాస్త టీడీపీ పట్ల సానుకూలంగానే వ్యవహరిస్తోంది. చంద్రబాబును ఢిల్లీలోని ఆజాదీకా అమృత్ మహోత్సవాలను ఆహ్వనించింది. ఇక భీమవరంలో మోదీ పర్యటనకు టీడీపీకి ఆహ్వానం పంపింది. ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో మోదీతో చంద్రబాబు ఐదు నిమిషాల పాటు ఏకాంతంగా మాట్లాడారు. ఆ తర్వాత టీడీపీ, బీజేపీ కలుస్తాయనే ప్రచారం జాతీయ మీడియాలో జోరుగా వినిపించింది. బీజేపీ నేతలు కూడా ఈ విషయాలను ఎక్కడా పెద్దగా ఖండించిన దాఖలాలు లేవు.

దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు మరోసారి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఉన్నట్లుంటి చంద్రబాబు, పవన్ కలవడంతో బీజేపీ వర్గాలు అలర్ట్ అయ్యాయి. తమతో కలిసి ఉన్న పవన్.. చంద్రబాబుతో ఎందుకు కలిశారనే విషయంపై ఆరా తీస్తున్నారు. పవన్ సాయం తెలంగాణలో బీజేపీకి అవసరం. అందుకే పవన్ ను వదిలిపెట్టుకోకూడదనే ఆలోచనలో బీజేపీ వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పవన్ స్నేహన్ని ఇప్పటికీ బీజేపీ కోరుకుంటోంది. ఢిల్లీ వెళ్లిన పవన్ ప్రధాని మోదీ, అమిత్ షాలతో కలుస్తారనే ప్రచారం జరుగుతోది. పవన్ ఢిల్లీ తర్వాత పొత్తులపై మరింత క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Namrata Shirodkar: రోజురోజుకూ మహేష్ భార్య చిన్నపిల్లవుతోంది.. 50 ఏళ్ల వయస్సులో ఇదేం అందమంటూ?

Namrata Shirodkar:  మనకు వయసు పైబడే కొద్ది మన అందం కూడా తగ్గుతుందని చెప్పాలి. ఇలా వయసు పైబడిన కొద్ది అందం కాపాడటం కోసం సెలబ్రిటీలు పెద్ద ఎత్తున కష్టపడుతూ ఉంటారు కానీ...
- Advertisement -
- Advertisement -