Pawan Kalyan: ఆ కారణాల వల్లే తక్కువ సీట్లలో పోటీ.. పవన్ క్లారిటీతో వైసీపీ సైలెంట్ అవుతుందా?

Pawan Kalyan: ఏపీలో వైసీపీ నెలన్నర నుంచి అభ్యర్థులను ప్రకటిస్తోంది. అయితే.. టీడీపీ, జనసేన అభ్యర్థులను ప్రకటించే విషయంలో వెనకబడ్డారని వైసీపీ విమర్శలు చేస్తూ వచ్చింది. రాజకీయ వర్గాల్లో కూడా అదే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, లేట్ గా వచ్చినా లేటెస్టుగా రావాలి అన్నట్టు చంద్రబాబు, పవన్ ఏకంగా 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఏడు విడతలుగా అభ్యర్థులను ప్రకటిస్తున వైసీపీ ఇప్పటి వరకూ సగం మందిని కూడా ఫైనల్ చేయలేదు. ఒకేసారి కూటమి నేతలు మాత్రం 99 స్థానాలను ప్రకటించారు. అందులో టీడీపీ 94 మంది అభ్యర్థులను ప్రటించగా.. జనసేన ఐదుగురిని ప్రకటించింది. జసనేన ఐదుగురినే ప్రకటించినప్పటికీ.. పొత్తులో భాగంగా ఆ పార్టీకి చంద్రబాబు 24 సీట్లు కేటాయించారు.

దీంతో.. వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు పల్లికి మోయడానికి జనసేన పావు శాతం షేర్ అయిన తీసుకోలేదని సెటైర్లు వేస్తున్నారు. అంతేకాదు.. పల్లకి మోయడం పక్కన పెట్టి అన్నలా సినిమాలు తీసుకుంటే మంచిదని పవన్ పై వైసీపీ పంచులు వేస్తుంది. అయితే, పవన్ మాత్రం సీట్ల విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. గత ఎన్నికల్లో కనీసం 10 స్థానాల్లో గెలిస్తే.. ఇప్పుడు 60 స్థానాలు డిమాండ్ చేసేవాళ్లమని ఆయన అన్నారు. ఎన్ని స్థానాలు తీసుకున్నామనే విషయాన్ని పక్కన పెట్టి.. జనసేనకు వచ్చిన సీట్లలో ఎన్ని స్థానాల్లో గెలవాలని అని ఫోకస్ చేయడం మంచిదని పవన్ చెప్పారు. స్ట్రైక్ రేట్ ఎక్కువగా ఉంటే.. భవిష్యత్ లో పార్టీకి మంచి రోజులు ఉంటాయని అన్నారు. జనసేనాని మొదటి నుంచి పార్టీ కార్యకర్తలను వాస్తవానికి దగ్గరగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు.

గతంలో చాలా సార్లు సీఎం సీఎం అని అరిస్తే.. ఇలా అరుపులతో సీఎం అవ్వలేమని.. ఎమ్మెల్యేలను గెలిపిస్తేనే సీఎం అవుతానని అన్నారు. కాబట్టి.. జనసేన ఎమ్మెల్యేలను గెలిపించాలని కోరారు. అంతేకాదు.. పొత్తులో భాగంగా రెండున్నరేళ్లు సీఎం డిమాండ్ చేయాలని చాలా మంది పవన్ కు సూచించారు. కానీ, ఆ దిశగా పవన్ ప్రయత్నాలు చేయలేదు. గత ఎన్నికల్లో ఒకే ఒక స్థానాన్ని గెలుచుకున్న జనసేన ఇప్పుడు సీఎం అడగడం వాస్తవానికి దూరంగా ఉంటామని పవన్ కు తెలుసు. అంతేకాదు… ఎక్కువ స్థానాలను డిమాండ్ చేసి.. ఆ తర్వాత గెలవకపోతే.. అధికారానికి దూరం అవుతామని కూడా ఆయన అర్థం చేసుకున్నారు. అందుకే.. ఈసారి 24 స్థానాలతో సరిపెట్టుకున్నారు.

అంతేకాదు.. టీడీపీ, జనసేన పొత్త పొడవకుండా ఉండాలని వైసీపీ తీవ్ర ప్రయత్నం చేసింది. జనసేన కార్యకర్తలను రెచ్చ గొట్టే ప్రయత్నం చేశారు. పవన్ .. కాపులను చంద్రబాబుకు తాకట్టు పెట్టారని అన్నారు. పవన్ కు సీట్లు అవసరం లేదు.. కోట్లు, ప్యాకేజీలు ఉంటే చాలని విమర్శించారు. కానీ, పవన్ సంయమనం పాటిస్తూ వచ్చారు. ఈసారి జనసేన తరుఫున కొంతమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టారు. అది కూడా అధికారంలో ఉండాలని అనేది పవన్ లక్ష్యం. దానికి అనుగుణంగానే నడుస్తున్నారు. కానీ.. వైసీపీ నేతలు పోలింగ్ వరకు.. ఆతర్వాత.. కూటమి అధికారంలోకి వస్తే.. ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కూడా జనసేన కార్యకర్తలను రెచ్చ గొడుతూనే ఉంటారని పవన్ కి తెలుసు. దానికి తగ్గట్టుగానే పార్టీ శ్రేణులను సిద్దం చేయడానికి పవన్ సిద్దంగా ఉన్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -