Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సంచలన వ్యూహాలు.. జగన్, చంద్రబాబుకు భారీ షాకులు తప్పవా?

Pawan Kalyan: వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అధికార పార్టీ వైసీపీని ఓడించే విధంగా ప్రజల్లో మార్పు తీసుకువచ్చేందుకు పవన్ కళ్యాణ్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. పదునైన విమర్శలతో వైసీపీ ని ఇరుకున పెట్టడంలో పవన్ సక్సెస్ అయ్యారు. అనుకున్న దానికంటే ఎక్కువగా సక్సెస్ కావడంతో పవన్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. అదే జోరు మీద ఉన్నా పవన్ కళ్యాణ్ పార్టీ నేతలతో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి మీద అసలు పోరాటం చేయవలసిన అవసరాన్ని గుర్తు చేశారు.

జగన్ ని గద్ద దింపాలంటే అందరూ సమిష్టిగా పోరాటం చేయడం ఒకటే మార్గం అని రాష్ట్రాన్ని జగన్ పాలన నుంచి కాపాడుకోవాలంటే అందరం సమిష్టిగా కృషి చేయాలి. ఒకవేళ ఈ పోరాటంలో కనుక మనం ఓడిపోతే మళ్ళీ జగనే అధికారంలోకి వస్తారని తన ఆందోళన వ్యక్తం చేశాడు పవన్ కళ్యాణ్. అలాగే రాబోయే ఎన్నికలలో కచ్చితంగా 2019 మోడల్ అయితే అనుసరించేది లేదు వచ్చే ఎన్నికల కోసం ప్రత్యేకమైన మోడల్ రెడీ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

 

పార్టీ బలోపేతం విషయంలో రెగ్యులర్గా సర్వేలు చేస్తున్నట్లు వాటి ఆధారంగా పోటీ ఉంటుంది అని పరోక్షంగా చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. ఇక వాలంటీర్ల వ్యవస్థపై కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. గత రెండు సంవత్సరాలుగా వాలంటీర్లపై తనకి అందుతున్న సమాచారం ప్రకారం ఆ విధంగా కామెంట్ చేసినట్లు చెప్పుకొచ్చారు ఈ వ్యవస్థపై మళ్లీ మళ్లీ బహిరంగ సభలలో మాట్లాడుతాను ఎందుకంటే ఇది వైసీపీకి ప్రైవేట్ సైన్యంగా మారిపోయింది అంటూ తన ఆగ్రహాన్ని వెళ్ళగక్కారు పవన్ కళ్యాణ్.

 

నేతలు క్షేత్రస్థాయిలో కష్టపడి పని చేయాలి ముందస్తు ఎన్నికల వాతావరణం స్పష్టంగా కనబడుతోంది అని కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపారు పవన్ కళ్యాణ్. ఎంతో సుందరమైన నగరంగా పేరున్న విశాఖపట్నం ఇప్పుడు ఆర్గనైజ్డ్ క్రైమ్ క్యాపిటల్ గా మారిపోయింది. క్రైమ్ లో తప్ప పలానా రంగంలో ఏపీ అగ్రభాగంలో లేదని మండిపడ్డారు పవన్. నాయనా వ్యాఖ్యలు చూస్తుంటే జగన్ కి చంద్రబాబు కి భారీ షాకులు తప్పవేమో అంటున్నారు రాజకీయ వర్గాలవారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -