BRO Movie Collections: 50 కోట్ల మార్కును దాటిన పవన్ కళ్యాణ్ బ్రో మూవీ.. కానీ?

BRO Movie Collections: సాయి ధరంతేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మల్టీ స్టార్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం బ్రో. ఈ సినిమా తమిళ వినోదయ సీతం సినిమాకు రీమేక్ చిత్రం. ఇలా ఈ సినిమా ఈనెల 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ మొదటి రోజు మాత్రం అద్భుతమైన ఓపెనింగ్స్ రాబట్టింది. ఇలా కొన్ని ప్రాంతాలలో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నటువంటి ఈ సినిమా మొదటివారం అద్భుతమైన కలెక్షన్లు రాబట్టింది.

ఇక సినిమా ప్లాప్ టాక్ వచ్చిన మిక్స్డ్ టాక్ వచ్చిన కలెక్షన్ల విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ రికార్డులను ఎవరు తిరగ రాయలేరు అని చెప్పాలి. ఈ క్రమంలోనే బ్రో సినిమా కూడా మొదటివారం ఏ ఏ ప్రాంతాలలో ఎంత మేర కలెక్షన్లు రాబట్టాయనే విషయానికి వస్తే…

 

నైజాం17.25 cr ,సీడెడ్5.51 cr, ఉత్తరాంధ్ర5.67 cr, ఈస్ట్3.93 cr,వెస్ట్3.74 cr, గుంటూరు3.95 cr, కృష్ణా2.74 cr, నెల్లూరు1.35 cr, ఏపీ + తెలంగాణ (టోటల్)44.14 crరెస్ట్ ఆఫ్ ఇండియా4.77 cr, ఓవర్సీస్5.85 cr, వరల్డ్ వైడ్ (టోటల్)54.76 cr (షేర్)

 

ఈ సినిమా రూ.97.98 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.98.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికి రూ.54.76 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.43.74 కోట్ల షేర్ ని రాబట్టాల్సి ఉంది. ఈ వారంలో కూడా ఎలాంటి సినిమాలు లేకపోవడంతో ఈ సినిమాకు కాస్త కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఈ వారం మొత్తం ఇదే స్థాయిలో కలెక్షన్లను కనుక రాబడితే ఈ సినిమా చాలా సులభంగా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని చెప్పాలి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -