Assembly Elections: ఏపీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్.. టీడీపీ కూటమిదే విజయం.. ఆ సర్వేలో ఎన్ని సీట్లు వచ్చాయంటే?

Assembly Elections: ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలలో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలా 175 స్థానాలలో గత ఎన్నికలలో 151 స్థానాలలో వైఎస్ఆర్సిపి గెలుపొంది అఖండ విజయాన్ని సొంతం చేసుకుని ప్రతిపక్షాలు కేవలం 23 స్థానాలకే పరిమితం చేసిన సంగతి తెలిసిందే. అయితే వచ్చే ఎన్నికలలో పెద్ద ఎత్తున 2 పార్టీల మధ్య భారీ పోటీ ఏర్పడిందని తెలుస్తుంది. నువ్వా నేనా అన్న దిశగా ఎన్నికలు జరగబోతున్నాయి.

ఈ క్రమంలోనే పలు సర్వేలు కూడా వచ్చే ఎన్నికలలో గెలుపోటములు ఎవరివి అనే విషయాల గురించి తెలియజేస్తున్నారు. అయితే తాజాగా పయనీర్ పోల్ సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి అయితే ఈ సర్వే ఫలితాలు చూసి వైసిపి నేతల గుండెల్లో గుబులు మొదలైంది. 175 స్థానాలకు గాను తెలుగుదేశం జనసేన ఏకంగా 104 స్థానాలను కైవసం చేసుకుంటుందని ఈ సర్వే వెల్లడించింది.

ఇలా టిడిపి జనసేన కూటమిగా ఏర్పడి 14 స్థానాలలో విజయం సాధించి అధికారం అందుకోబోతున్నారని ఈ సర్వే వెల్లడించడంతో వైఎస్ఆర్సిపి నేతల గుండెల్లో గుబులు మొదలైంది. ఇక ఎంపీ స్థానాల విషయానికి వస్తే రాష్ట్రంలో మొత్తం 25 స్థానాలు ఉండగా టీడీపీ+జనసేన అత్యధికంగా 18 సీట్లు, వైసీపీ -7 సీట్లు దక్కించుకోనుందని ఈ సర్వే ఫలితాలలో వెల్లడైంది.

అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ+జనసేన కూటమికి అత్యధికంగా 52 శాతం ఓటు షేర్ దక్కించుకోనుంది ఇక వైఎస్ఆర్సిపి పార్టీ 42% ఓటు షేర్ దక్కించుకోగా కాంగ్రెస్ పార్టీ 2.4 శాతం ఓట్లు రానున్నాయని సర్వే లెక్కగట్టింది. ఇక కేంద్రంలోని బీజేపీకి 1.5 శాతం ఓట్లు, ఇతరులకు 2.1 శాతం ఓట్లు పడనున్నాయని వివరించింది. ఇలా ఈ పయనీర్ పోల్స్ సర్వే ప్రకారం వచ్చే ప్రభుత్వం మాత్రం తెలుగుదేశం జనసేన కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాయని స్పష్టంగా తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -