Bahubali 3: ప్రభాస్ బాహుబలి3 మూవీ బడ్జెట్ ఏకంగా అన్ని రూ.కోట్లా?

Bahubali 3: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే. కాగా ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం ప్రాజెక్ట్ కె, సలార్, ఆది పురుష్, స్పిరిట్ లాంటి సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

కాగా ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా ఈనెల 16న విడుదల కానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు ప్రభాస్. అలాగే ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్టు కె సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. కాగా ఇందులో హీరో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఇందులో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా కీలకపాత్రలో నటిస్తున్నారు.

 

ఇకపోతే దర్శకుడు రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్ లో చత్రపతి,బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలు విడుదల అయిన విషయం తెలిసిందే. ఇక బాహుబలి 1, 2 సినిమాలు ఏ రేంజ్ లో సక్సెస్ను సాధించాయో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పాన్ ఇండియా ట్రెండ్ ని పరిచయం చేశారు రాజమౌళి. అంతేకాకుండా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడంతో పాటు కలెక్షన్ల సునామినీ సృష్టించాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రభాస్ రాజమౌళికి సంబంధించి ఒక వార్త చెక్కర్లు కొడుతోంది. అదేమిటంటే వీరిద్దరి కాంబినేషన్ లో దాదాపు పదివేల కోట్ల బడ్జెట్ తో బాహుబలి 3 సినిమా రాబోతోంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. దీంతో అభిమానులు షాక్ అవుతున్నారు. వామ్మో ఏకంగా 10 వేల కోట్ల బడ్జెటా! అంటూ ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -