Prabhas: కన్నీళ్లు పెట్టుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్.. ఏమైందంటే?

Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ప్యాన్ ఇండియా లెవల్ లో సినిమాను వెలిగిపోయేలా చేసిన హీరో డార్లింగ్ ప్రభాస్. ‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా కీర్తిపతాకాలను దేశం నలుమూలలా ఎగరవేసిన ప్రభాస్.. ప్రస్తుతం ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కలిసి ‘సలార్’ సినిమా చేస్తున్న ప్రభాస్.. ప్రాజెక్ట్ కెతో పాటు ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు.

 

 

అయితే ప్రభాస్ సినిమా ‘ఆదిపురుష్’ మీద భారీ అంచనాలు ఉండగా.. ఈ సినిమాకు సంబంధించిన ప్రోమో విడుదలైన తర్వాత మాత్రం తీవ్ర విమర్శలు వచ్చాయి. సినిమా గ్రాఫిక్స్ విషయంలో చాలా దారుణమైన నాణ్యతా ప్రమాణాలను పాటించారని, టీవీల్లో వచ్చే కార్టూన్ల కన్నా దారుణమైన గ్రాఫిక్స్ ఉన్నాయనే విమర్శలు వినిపించాయి. అదే సమయంలో హనుమంతుడి రూపం విషయంలో, రావణుడిని చూపించిన విషయంలో కూడా వివాదాలు తలెత్తాయి. దీంతో సినిమాను వాయిదా వేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.

 

సగటు ప్రేక్షకుడితో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ ను కూడా నిరాశపరిచిన ‘ఆదిపురుష్’ సినిమా తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. ఆదిపురుష్ సినిమా ప్రోమో విషయంలో నిబంధనలు పాటించలేదని అలహాబాద్ హైకోర్టులో ఓ వ్యక్తి పిల్ దాఖలు చేయడం జరిగింది. కుల్దీప్ తివారీ అనే వ్యక్తి సెన్సార్ బోర్డ్ నుండి సర్టిఫికెట్ పొందకుండానే ఆదిపురుష్ చిత్ర నిర్మాతలు సినిమా ప్రోమోను విడుదల చేశారని పిల్ దాఖలు చేశాడు.

 

సెన్సార్ బోర్డ్ నుండి సర్టిఫికెట్ పొందకుండా ప్రోమోను విడుదల చేయడం అనేది నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని కుల్దీప్ తివారీ కోర్టుకు వివరించాడు. ఈ పిల్ ను జస్టిస్ రాజేష్ బిందాల్, జస్టిస్ బిఆర్ సింగ్ లతో కూడిన ధర్మాసనం విచారించి.. పిల్ పై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సెన్సార్ బోర్డుకు అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై తదుపతి విచారణను ధర్మాసనం ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -