Ormax Media Survey: టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా చోటు సంపాదించుకున్న ప్రభాస్?

Ormax Media Survey: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం ఉన్నప్పటికీ వారి సినిమాల పరంగా వారి మధ్య పోటీ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ సినిమాలలో నటిస్తుంటారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున అరడజనుకు పైగా హీరోలు నెంబర్ వన్ స్థానం కోసం పోటీ పడుతూ ఉంటారు.ఈ క్రమంలోనే నెంబర్ వన్ స్థానంలో ఎవరు ఉంటారు అనే విషయంపై అభిమానుల సైతం ఆసక్తి కనబరుస్తారు.

ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో అంటే చిరంజీవి పేరు మాత్రమే ఉండేది. బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ వంటి హీరోలు పోటీ ఉన్నప్పటికీ నెంబర్ వన్ స్థానంలో మాత్రం చిరంజీవి గారే ఉంటారు. అయితే ప్రస్తుత జనరేషన్లో పెద్ద ఎత్తున నెంబర్ వన్ స్థానం కోసం హీరోలు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ప్రభాస్ అల్లు అర్జున్ రామ్ చరణ్ మహేష్ బాబు వంటి హీరోలు ఒకరిని మించి ఒకరు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకొని ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

ఈ క్రమంలోనే ఈ హీరోలందరూ కూడా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ ఎంతో మంచి ఆదరణ పొందారు. ఇకపోతే ప్రతినెల ఆర్మక్స్ సమస్థ నిర్వహించే సర్వేలో భాగంగా ప్రతినెల టాలీవుడ్ హీరోలతో పాటు నేషనల్ వైడ్ అత్యధిక ఆదరణ పొందిన హీరోల జాబితాను విడుదల చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ నెలలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన హీరోల జాబితాను విడుదల చేశారు.

ఈ జాబితాలో భాగంగా ప్రభాస్ నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నారు.బాహుబలి తర్వాత ఈయన నటించిన సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ ప్రేక్షకులు పెద్ద ఎత్తున ప్రభాస్ ను ఆదరించడంతో సెప్టెంబర్ నెలకు గాను అత్యంత ఆదరణ పొందిన హీరోగా ప్రభాస్ చోటు సంపాదించుకున్నారు. ప్రభాస్ తర్వాత ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు మొదటి ఐదు స్థానాలలో చోటు సంపాదించుకున్నారు. ప్రభాస్ మొదటి స్థానంలో ఉండటంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -