Prakash Raj: దీపిక డ్రెస్‌పై ప్రకాష్ రాజ్ కామెంట్స్ వింటే షాకవ్వాల్సిందే!

Prakash Raj: సినిమాలోని సన్నివేశాల విషయంలో డైరెక్టర్లు ఎంతో ఆచితూచీ అడుగులు వేస్తారు. ఒక మతం, కులానికి వ్యతిరేకంగా మాట్లాడినా.. మత పరమైన సన్నివేశాలు ఉన్నా.. పెద్ద రచ్చ జరుగుతుంది. ఇలాంటి వివాదాలు ఇప్పటివరకు మనం చాలానే చూశాం. తాజాగా ఇలాంటి సమస్యే బాలీవుడ్‌ మూవీ ‘పఠాన్’కు ఎదురైంది. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. వచ్చే ఏడాది జనవరి 25వ తేదీన థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

 

 

ఇటీవల ఈ సినిమా నుంచి ‘బేషరమ్’ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్ సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలోనే రెస్పాన్స్ వచ్చింది. ఎన్నడూ లేని విధంగా దీపికా పదుకొణె ఈ సాంగ్‌లో తన అందాలను ఆరబోసింది. సాంగ్ మొత్తం బికినీలోనే దర్శనం ఇచ్చింది. చూడటానికి పూర్తిగా భిన్నంగా, కొత్తగా ఉంది. షారుఖ్ ఖాన్ కూడా షర్ట్ ధరించకుండా.. తన సిక్స్ ప్యాక్స్ చూపించాడు. అయితే ఈ పాటలో దీపికా పదుకొణె ధరించిన కాస్ట్యూమ్స్ పై వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. కాషాయ రంగులో డ్రెస్సును ధరించి రొమాన్స్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై కొందరు మండిపడుతుండగా.. మరికొందరు మద్దతులు తెలుపుతున్నారు.

 

 

ఈ క్రమంలో మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ‘బేషరమ్’ సాంగ్‌ను డర్టీ మైండ్‌తో చిత్రీకరించినట్లు పేర్కొన్నారు. దీపికా పదుకొణె ధరించిన కాస్ట్యూమ్స్ అసభ్యకరంగా ఉన్నాయని చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ ట్విట్టర్‌లో ఈ విధంగా రాసుకొచ్చాడు. ‘కాషాయం ధరించిన స్వామిజీలు, ఎమ్మెల్యేలు మైనర్లని అత్యాచారం చేసినప్పుడు ఎలాంటి సమస్య రాలేదు. అలాంటి వాళ్లు పబ్లిక్‌గానే తిరగవచ్చు. అప్పుడు ఎవరూ నోరు మెదపరు. అది మీకు సమస్య కాదు. కానీ దీపికా పదుకొణె సినిమాలో కాషాయం కాస్ట్యూమ్ ధరించినప్పుడు మాత్రమే ఇబ్బందిగా ఉందా? చెప్పండి.’ అని ప్రకాష్ రాజ్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

Governor Tamilisai: నాపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా.. గవర్నర్ తమిళిసై విమర్శలు మామూలుగా లేవుగా!

Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై కెసిఆర్ ప్రభుత్వం మద్య తరచు వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వం తరచు ఈమెపై విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే...
- Advertisement -
- Advertisement -