Raghava Lawrence: స్టార్ హీరో లారెన్స్ కూతురి ఫోటోలను చూస్తే షాకవ్వాల్సిందే.. అందాల ఆడబొమ్మలా ఉందంటూ?

Raghava Lawrence:  తెలుగు సినీ ప్రేక్షకులకు తమిళ హీరో, నటుడు నృత్య దర్శకుడు అయిన రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాఘవ లారెన్స్ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేసి సినిమా కాంచన. ఈ సినిమాతో భారీగా పాపులారిటీని ఏర్పరచుకున్నాడు రాఘవ. కాగా హీరో రాఘవ రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఎంతో మందికి సహాయం చేసి హీరో అనిపించుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా సహాయం చేయడంలో కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో హీరో రాఘవ ఎప్పుడు ముందు ఉంటారన్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఎంతోమందికి సహాయం చేసి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇది ఇలా ఉంటే రాఘవ లారెన్స్ తాజాగా నటించిన చిత్రం చంద్రముఖి 2. గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరో కొరియోగ్రాఫర్ అయినా రాఘవ లారెన్స్ గురించి ఆయన సినిమా లైఫ్ గురించి మనందరికీ తెలిసిందే. కానీ ఆయన వ్యక్తిగత విషయాల గురించి ఫ్యామిలీ విషయాల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. లారెన్స్ భార్య పేరు లత. ఈమె కూడా సామాజిక సేవ చేయడంలో భర్తకు అండగా పిలుస్తూ ఉంటుంది.

లతను పెళ్లి చేసుకున్న తర్వాతే తాను డ్యాన్స్ మాస్టర్‌గా ఎదిగానని, సినిమాల్లో ఇంత ఎత్తుకు ఎదిగానని, ఆమె వల్లే తనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని లారెన్స్ ఒక ఇంటర్వ్యూలలో తెలిపారు. లారెన్స్, లత దంపతులకు రాఘవి అనే కుమార్తె కూడా ఉంది. అయితే లారెన్స్‌కి ఒక కూతురు ఉందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. ఇప్పుడు రాఘవి సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు లారెన్స్‌ అభిమానుల్లో చర్చ జరుగుతోంది. దాంతో రాఘవ లారెన్స్‌కి ఇంత పెద్దకూతురు ఉందా అంటూ పలువురు అభిమానులు నెటిజన్స్ షాక్ అవుతున్నారు.

కాగా త్వరలో ఒక మంచి సినిమాతో ఆమె ఎంట్రీ ఇస్తుందని ప్రచారం కూడా జరుగుతోంది. అందుకు కథను కూడా లారెన్స్‌ సెలక్ట్‌ చేశాడని కూతురి తొలి సినిమాకు ఆయన డైరెక్షన్‌ చేస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాదితో ఆమె గ్రాడ్యేషన్‌ పూర్తి అవుతుందని తెలుస్తోంది. రాఘవి మోడ్రన్ డ్రెస్సుల్లో స్టైలిష్‌గా పోజులిచ్చిన ఫోటోలు కూడా తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ కుందనపు బొమ్మలా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -