Raghava Lawrence: నువ్వు గొప్పోడివి సామీ.. రాఘవ లారెన్స్ పై నెటిజన్ల ప్రశంసలు!

Raghava Lawrence: రాఘవ లారెన్స్ పరిచయం అవసరం లేని పేరు..సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా నటుడిగా కొరియోగ్రాఫర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాఘవ లారెన్స్ కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్నారు. అయితే ఈయనకు తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.ఈయన నటించిన సినిమాలన్నీ కూడా తెలుగులో విడుదలవుతూ ఇక్కడ కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకోవడమే కాకుండా లారెన్స్ కి విపరీతమైన క్రేజ్ ఫాలోయింగ్ కూడా ఉందని చెప్పాలి.

ఇలా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి రాఘవ లారెన్స్ నిజజీవితంలో కూడా రియల్ హీరో అనిపించుకున్నారు.ఇప్పటికే ఈయన రాఘవ లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది చిన్నారులను చేరదీసి వారి బాగోగులు చూసుకోవడమే కాకుండా ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాదాపు 141 చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించారు.

ఇలా తరచూ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి మనసున్న వ్యక్తిగా ఈయన నిజ జీవితంలో కూడా హీరో అనిపించుకున్నారు.తాజాగా ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈయన కొందరు చిన్నారులతో కలిసి దిగినటువంటి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ ఫోటోని షేర్ చేసిన లారెన్స్ తాను 150 మంది చిన్నారులను దత్తత తీసుకొని వారి చదువు వారి బాగోగులను తానే చూసుకుంటున్నానని తెలిపారు.

 

ఇలా 150 మంది చిన్నారులను దత్తత తీసుకున్నారనే విషయం తెలియడంతో నెటిజన్స్ ఒక్కసారిగా ఈయనపై ప్రశంసలు కురిపిస్తూ మీది చాలా మంచి మనసు అంటూ కామెంట్లు చేయగా మరికొందరు నువ్వు చాలా గొప్పోడివి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈయన నటించిన రుద్రన్ సినిమా ఏప్రిల్ 14వ తేదీ విడుదల కాబోతుంది. ఈ సినిమా తెలుగులో రుద్రుడు అనే పేరిట విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాదులో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈయన మాట్లాడుతూ రాఘవేంద్ర స్వామి ఆశీస్సులతోనే తాను సేవాగుణంలో ముందడుగు వేస్తున్నానని తెలియజేశారు. తన తల్లి తనకు ఎప్పుడు ఒక మాట చెబుతూ ఉండేది తెరపై మాత్రమే కాదు నిజ జీవితంలో కూడా హీరో అనిపించుకోవాలనీ చెబుతూ ఉండేదని ఈ సందర్భంగా లారెన్స్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -