Raghava Lawrence: నిర్మాతకు అండగా నిలిచిన లారెన్స్.. మంచి మనసంటూ ప్రశంసలు!

Raghava Lawrence: కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా,దర్శకుడిగా కొరియోగ్రాఫర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా నిజ జీవితంలో కూడా రియల్ హీరో అనిపించుకున్నారు. ఎవరికైనా కష్టం వస్తే నేనున్నాను అని భరోసా ఇస్తూ వారి కష్టాలను తీరుస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.ఇలా రాఘవ లారెన్స్ అనే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇకపోతే గత కొద్దిరోజుల క్రితం ఈయన అనారోగ్యంతో బాధపడుతూ అనాధ అయినటువంటి చిన్నారులను దత్తత తీసుకొని వారి విద్య వైద్య బాగోగులు అన్నింటిని తానే చూసుకోబోతున్నానని అందుకు మీ ఆశీర్వాదాలు కావాలి అంటూ లారెన్స్ తెలియజేసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా లారెన్స్ ఎప్పటికప్పుడు ఇతరులకు సహాయ సహకారం అందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇకపోతే తాజాగా మరోసారి ఈయన తన మంచి మనసు చాటుకున్నారు.

తమిళంలో నిర్మాతగా పలు సినిమాలను నిర్మించి చివరి రోజులలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నిర్మాత వి ఏ దురై ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కనీసం చికిత్సకి కూడా డబ్బులు లేని పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన తన కన్నీటి కష్టాలను చూపుతూ ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తనకు సహాయం చేయాలని కోరారు. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తనకు సహాయం చేయడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ వీడియో చూసినటువంటి రాఘవ లారెన్స్ ఏకంగా బుధవారం ఆయన వద్దకు వెళ్లి స్వయంగా మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి తనకు అండగా నిలిచారు. ఇలా వైద్య ఖర్చులకోసం లారెన్స్ నిర్మాతకు ఆర్థిక సహాయం చేయడంతో నేటిజన్స్ ఈయన మంచి మనసు పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక లారెన్స్ నటించిన రుద్రన్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా తెలుగులో రుద్రుడు పేరిట విడుదలైంది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -