Rajagopal Reddy: మునుగోడులో పోటీ చేయబోనంటున్న రాజగోపాల్ రెడ్డి.. ఆ ఓటమి భయమే కారణమా?

Rajagopal Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీలో అసంతృప్తి, టిక్కెట్లు కేటాయించకపోవడం తదితర కారణాలతో పార్టీలలో జంపింగులు ఎక్కువయ్యాయి. అయితే ఇప్పుడు బీజేపీ నేత మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి కూడా అదే అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఆయన మునుగోడులో పోటీ చేయటానికి సిద్ధంగా లేనని చెప్పటం ఇందుకు సాక్ష్యం.

బీజేపీ తొలి జాబితా పార్టీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ రాజగోపాల్ రెడ్డికి అభ్యర్థిత్వం ఖరారు చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడులో సింపతితో అయినా ఆయన కచ్చితంగా గెలుస్తారని బీజేపీ నాయకత్వం ఆయనకు భరోసా ఇస్తుంది. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం అక్కడ నుంచి పోటీ చేసేందుకు వెనుకా, ముందు ఆలోచిస్తున్నారు. అందుకు కారణం కూడా ఉంది. ఎన్నిసార్లు అక్కడ సర్వే చేయించినా ప్రధాన పోటీ అంతా కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య కనిపిస్తోంది.

కాబట్టి తను పోటీ చేసినా గెలవను అనే ఒక అభిప్రాయానికి వచ్చిన రాజగోపాల్ రెడ్డి పోటీ విషయంలో పునరాలోచనలో పడుతున్నారు. ఒకవేళ కాంగ్రెస్ ఆ సీట్ ని సిపిఐ కి కేటాయిస్తే, కాంగ్రెస్ ఓటు తనకు క్రాస్ అయితే గెలవచ్చని ఆలోచనతో ప్రస్తుతానికి తన అభ్యర్థిత్వాన్ని హోల్డ్ లో పెట్టాలని జాతీయ నాయకత్వాన్ని రాజగోపాల్ రెడ్డి కోరినట్లు సమాచారం. మునుగోడు లో కాంగ్రెస్ అభ్యర్థి బరిలో ఉంటే తనకు ఎల్బీనగర్ సీటు కేటాయించాలని లేనిపక్షంలో తాను అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయబోనని చెప్పారు.

దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారు అనే అభిప్రాయానికి వచ్చేసారు అని వార్తలు వినిపిస్తున్నాయి. గత ఏడాది కాంగ్రెస్ పార్టీకి మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. ఆ తర్వాత బీజేపీ లో చేరి మునుగోడు ఉప ఎన్నికల బరిలో నిలిచారు. 2022 నవంబర్లో జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -