Komati Reddy Venkat Reddy: కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై సస్పెన్షన్ వేటు? షాకింగ్ నిర్ణయం దిశగా కాంగ్రెస్

Komati Reddy Venkat Reddy: మునుగోడు ఉపఎన్నిక క్రమంలో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం రచ్చకు దారి తీస్తోంది. తన పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న మునుగోడు ఉపఎన్నికలో ఆయన ప్రచారం చేయకపోడంపై ఇప్పటికే కాంగ్రెస్ వర్గాలు ఆయనపై మండిపడుతున్నాయి. సొంత తమ్ముడికే కొమ్ముకాస్తున్నారనే, పార్టీని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం కుటుంబసభ్యులతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై కాంగ్రెస్ వర్గాలు సీరియస్ అవుతున్నాయి. కాంగ్రెస్ గెలుపు కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు శ్రమిస్తున్న క్రమంలో ఎంపీగా ఉన్న వెంకటరెడ్డి ఫ్యామిలీతో విదేశీ టూర్ కు వెళ్లడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఈ క్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియో లీక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఓటేయాలని కోరుతూ వెంకరెటడ్డి ఓటర్లను అభ్యర్థిస్తున్న ఆడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే ఈ ఆడియో క్లిప్ పై కోమటిరెడ్డి నుంచి ఎలాంటి స్పందన రాకపోయినా.. ఇందులో ఆయన వాయిస్ ఉండటంతో వెంకటరెడ్డిదే అని తెలుస్తోంది. దీంతో ఈ ఆడియో క్లిప్ తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. ఈ ఆడియో క్లిప్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు సీరియస్ అవుతున్నారు. దీనిపై కాంగ్రెస్ అధినాయకత్వానికి రాష్ట్ర నేతలు ఫిర్యాదు చేశారు.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఆయన పాల్పడుతున్నారని, చర్యలు తీసుకోవాలని ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు,యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో క్లిప్ ను కూడా కేంద్ర అధినాయత్వానికి పంపించారు. దీంతో ఈ ఆడియో క్లిప్ పై ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో వెంటకరెడ్డి నుంచి పార్టీ నుంచి కాంగ్రెస్ సస్పెండ్ చేస్తుందా అనే ప్రచారం జరుగుతోంది. గతంలోనే రాజగోపాల్ రెడ్డికి అనుకూలంగా ఆయన మాట్లాడుతున్నారని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.

అంతేకాదు ఆయనపై వేటు వేయాలని కొంతమంది నేతలు హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరిగింది. కానీ మునుగోడు ఉపఎన్నిక కాంగ్రెస్ కు కీలకంగా మారడంతో వెంకటరెడ్డిపై వేటు వేస్తే ప్రతికూల సంకేతాలు వెళ్లి పార్టీకి నష్టం జరిగే అవకాశముంది. అందుకే వెంకటరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు కాంగ్రెస్ వెనకడుగు వేస్తోందని, మునుగోుడు ఉపఎన్నికల తర్వాత ఆయనపై వేటు వేసే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది

ఇక వెంకటరెడ్డి ఆడియో క్లిప్ పై మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి స్పందించారు. ఆ ఆడియో క్లిప్ అంశం తన దృష్టికి ఇంకా రాలేదని, తాను ఇంకా వినలేదని తెలిపారు. ఆడియో క్లిప విని అది వెంకటరెడ్డిదా.. కాదా అనేది నిర్దారించుకున్న తర్వాత స్పందిస్తానంటూ చెప్పుకొచ్చారు. వెంకటరెడ్డి ఆశీస్సులు తనకే ఉన్నాయంటూ స్రవంతి రెడ్డి చెప్పుకొస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుామర్ రెుడ్డి మునుగోడులో తన గెలుపు కోసం శ్రమిస్తున్నట్లు తెలిపారు. వెంకటరెడ్డి కూడా కలిసొస్తే బాగుంటుందని తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -