Congress: మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ఆయనేనా?

Congress: మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఆ స్థానానికి ఉపఎన్నికల అనివార్యమైంది. గత కొంతకాలంగా కాంగ్రెస్ పై కోపంగా ఉన్న రాజగోపాల్ రెడ్డి.. ఎట్టకేలకు ఆ పార్టీతో సంబంధాలు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ ను వీడి బీజేపీ చెంతకు చేరారు. పలుమార్లు కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చలు జరిపారు రాజగోపాల్ రెడ్డి. చర్చలు అనంతరం ఎట్టకేలకు బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 21న మునుగోడులో జరిగే బహిరంగ సభలో అమిత్ షా సమక్షంలో రాజగోపాల్ రెడ్డి కాషాయ కండువా కప్పుకోనున్నారు.

తమ పార్టీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవిని వదులుకోవాలనే కండీషన్ ను తెలంగాణ బీజేపీ పెట్టింది. దీంతో ఆ రూల్ ప్రకారం రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, వెంటనే ఆయన రాజీనామాను స్పీకర్ ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. దీంతో మునుగోడు ఉపఎన్నికలకు పార్టీలన్నీ సిద్దమవుతున్నాయి. ఎవరి వ్యూహలు వాళ్లు రచిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికపై టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో ఫోకస్ పెట్టాయి. ఎవరికి టికెట్ కేటాయించాలనే దానిపై సర్వేలు చేస్తున్నాయి. గెలుపు గుర్రానికే టికెట్ ఇవ్వాలని టీఆర్ఎస్, కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నాయి.

ఈ క్రమంలో మునుగోడు పాలిటిక్స్ రోజురోజుకు హీటెక్కుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే దానిపై అనేక పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పల్లె రవికుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పల్లె రవికుమార్ సతీమణి చండూరు ఎంపీపీగా ఉన్నారు. దీంతో పల్లె రవికుమార్ పేరు రేసులో వినిపిస్తోంది. ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే ఉంది. దీంతో సిట్టింగ్ సీటును కోల్పోతే కాంగ్రెస్ మరిత నష్టపోయే అవకాశముంది. దీంతో సిట్టింగ్ సీటును ఎలాగైనా దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ కు కూడా ఇది అగ్నిపరీక్షగా మారింది. రేవంత్ పీసీసీ అయిన తర్వాత హుజూరాబాద్ ఎన్నికలు జరిగాయి. అయితే హుజూరాబాద్ టీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కావడంతో రేవంత్ అంతగా పట్టించుకోలేదు.

ఇప్పడు మునుగోడు కాంగ్రెస సిట్టింగ్ కావడంతో ఉపఎన్నికలో ఓడిపోతే రేవంత్ పీసీసీ చీప్ పదవిపై ప్రభావం పడే అవకాశముంది. దీంతో రేవంత్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇక టీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి సీటు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డికి ఫిక్స్ కనుక.. అభ్యర్థులపై క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇప్పటికే కమిటీలను ప్రకటించాయి. కాంగ్రెస్ మాత్రం పల్లె రవికుమార్ వైపు మొగ్గు చూపుతుంది. సొంత ప్రాంతం కావడం, బీసీ సామాజిక వర్గం కావడం ఆయనకు కలిసి వచ్చే అంశాలు. ఇక పల్లె రవికుమార్ తండ్రి తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా పాల్గొన్నారు. ఇక పల్లె రవికుమార్ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు.

దీంతో ఇవన్నీ మునుగోడులో ఆయనకు కలిసి వస్తాయని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇక పల్లె రవి భార్య చుండూరు ఎంపీపీగాఉండటంతో అక్కడ ప్రజలకతో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో మునుగోడు కాంగ్రెస్ టికెట పల్లె రవికుమార్ కు దాదాపుగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇక పాల్వాయి గోవర్దన్ రెడ్డి కుమార్తె స్రవంతి కూడా రేసులో ఉండగా.. ఇటీవల ఆమె ఫోర్ రికార్డింగ్ వ్యవహారం మైనస్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -