Sonia Gandhi: సోనియాకు కొత్త టెన్షన్.. అదే జరిగితే మొదటికే మోసం వస్తుందా?

Sonia Gandhi: జాతీయ రాజకీయాల్లో రాజస్థాన్ లోని అనూహ్య పరిణామాలు ఉత్కంఠ రేపుతోన్నాయి. రాజస్థాన్ రాజకీయాల్లో సమీకరణాలు మారిపోతున్నాయి. కాంగ్రెస్ లోని పరిణామాలు అక్కడి రాజకీయాల్లో సస్పెన్స్ గా మారాయి. ప్రస్తుతం రాజస్థాన్ సీఎంగా సీనియర్ నాయకులు అశోక్ గెహ్లాట్ ఉన్నారు. అయితే కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్నారు. నేడో, రేపో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. స్వయంగా సోనియా గాంధీ ఆయనను పిలిచి జాతీయ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ దాఖలు చేయాలని సూచించారు. దీంతో సోనియా అండదండలు ఉండటంతో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఆయన కన్ఫార్మ్ అని తెలుస్తోంది. ఇక తిరువనంతపురం ఎంపీ శవిథరూర్ ఠాకూర్ తో పాటు పలువురు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

కానీ అశోక్ గెహ్లాట్ సీనియర్ నేత కావడం, సోనియా కుటుంబంతో మంచి సన్నిహిత్యం ఉండటం, సోనియా, రాహుల్ కు అత్యంత నమ్మకస్తుడిగా ఉండటంతో కాంగ్రెస్ కొత్త జాతీయ అధ్యక్షుడు ఆయన ఫిక్స్ అని తెలుస్తోంది. ఎన్నికలు పద్దతి ప్రకారం నిర్వహించడం తప్పితే అశోక్ గెహ్లాట్ కు బాధ్యతలు అప్పగించడమే ఆలస్యం అని చెప్పవచ్చు. అయితే జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైతే అన్ని రాష్ట్రాల్లో పర్యటించాల్సి ఉంటుంది. పార్టీ బాధ్యతలను చూసుకోవాల్సి ఉంది. ఇలా చాలా పనులు ఉంటాయి. దీంతో రాజస్థాన్ సీఎంగా పనిచేయడం కష్టం. జోడుపదవులను నిర్వహించడం కష్టతరం. సీఎంగా కొనసాగుతూనే జాతీయ అధ్యక్ష పదవిని నిర్వర్తిస్తానంటూ సోనియాగాంధీ, రాహుల్ గాంధీని అశోక్ గెహ్లాట్ కోరారు.

కానీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తూ సీఎం బాధ్యతలు నిర్వర్తించడం కష్టమని అశోక్ గెహ్లాట్ కు సోనియా చెప్పారట. రెండు పదవులను నిర్వర్తించేందుకు సోనియా నిరాకరించారట. అశోక్ గెహ్లాట్ ఎంత ప్రయత్నాలు చేసినా సోనియా ససేమిరా అన్నారట. దీంతో ఇక అశోక్ గెహ్లాట్ రాజస్థాన్ సీఎం పదవిని వదులుకోవాలని నిర్ణయానికి వచ్చింది. దీంతో రాజస్థాన్ తర్వాత సీఎం ఎవరనేది కాంగ్రెస్ లో ఉత్కంఠ రేపుతోంది. అశోక్ గెహ్లాట్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. ఆ లోపు తర్వాతి సీఎం ఎవరనేది ఇప్పుడే ఎంపిక చేసే పనిలో కాంగ్రెస్ ఉంది.

ఆదివారం రాత్రి 7 గంటకు సీఎం అశోక్ గెహ్లాట్ ఇంట్లో సీఎల్పీ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో తర్వాతి సీఎం ఎవరే దానిపై చర్చ జరగనుంది. ఈ సమావేశంలో నేతల అబిప్రాయాలను పరిగణలోకి తీసుకుని సీఎంను పిక్స్ చేయనున్నారు. అసెంబ్లీ స్పీకర్ జోషి వైపు అశోక్ గెహ్లాట్ మొగ్గు చూపుతున్నారు. సచిన్ పైలెట్, అశోక్ గెహ్లాట్ మధ్య తీవ్ర విబేధాలు ఉన్నాయి. దీంతో ఆయనను సీఎం కాకుడా చేసేందుకు అశోక్ గెహ్లాట్ చక్రం తిప్పుతున్నారు. కానీ రాజస్థాన్ లో యువనేతగా సచిన్ పైలెట్ కు మంచి క్రేజ్ ఉంది. రాష్ట్రంలో ఆయనకు మంచి పలుకుబడి ఉంది.

గత ఎన్నికల తర్వాత కూడా సీఎం అభ్యర్థి సచిన్ ఫైలెట్ అని ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో అశోక్ గెహ్లాట్ రాయబారం నడిపి సీఎం పదవిని దక్కించుకున్నారు. దీంతో ఈ సారి సచిన్ పైలెట్ వైపే సోనియా గాంధీ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఒకవేళ సచిన్ పైలెట్ కు ఇవ్వకపోతే పార్టీలో చీలిక తీసుకొచ్చి ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం కూడా ఉందని సోనియా భయపడుతున్నారు. అలాంటి టెన్షన్ సోనియాలో ఉంది. అంతేకాకుండా గత ఎన్నికల్లో పార్టీ విజయం కోసం సచిన్ పైలెట్ చాలా కృషి చేశారు. అందుకే సచిన్ పైలెట్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -