YS Rajasekhar Reddy: సోనియా గాంధీ చంద్రబాబు కలిసి వైయస్ రాజశేఖర్ రెడ్డిని చంపేశారు….!

YS Rajasekhar Reddy: రాష్ట్రంలో వైసిపి నాయకులు అందరూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటారు. తమ నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తూ ఎదుటివారిపైన విమర్శలు చేస్తూ నిందలు వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదే కోవలోకి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కూడా వచ్చారు. ఆయన ఎప్పుడూ తన మాట తీరుతో వైరల్ అవుతూ ఉంటారు. ఒక్కొక్కసారి సొంత పార్టీ నాయకులు పైన కూడా విమర్శలు చేస్తారు.

 

తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై హైదరాబాద్ లోని బేగంబజార్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన ఘటన నేపథ్యంలో ఆయన మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ వ్యాఖ్యలను తెలంగాణ కాంగ్రెస్ నేతలు చాలా సీరియస్ గా తీసుకున్నారు. హైదరాబాద్ బేగంబజార్ లోని పోలీస్ స్టేషన్లో మల్లు రవి ఆయనపైన ఫిర్యాదు చేశారు. సోనియా గాంధీ పై అసత్యాలు, అవాస్తవాలు మాట్లాడిన నారాయణస్వామి పై కేసు నమోదు చేసి తీసుకోవాలంటూ చర్యలు తీసుకోవాలంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే తన పైన కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేయడం పైన నారాయణస్వామి మళ్లీ స్పందించారు. సోనియా గాంధీ చంద్రబాబు నాయుడు కలిసి వైయస్ రాజశేఖర్ రెడ్డిని హెలికాప్టర్ ప్రమాదంలో చంపేశారని రాష్ట్ర ప్రజలందరికీ అనుమానం ఉందని అన్నారు. ఆ సందేహాన్ని తీర్చే శక్తి సోనియా గాంధీకి గాని, చంద్రబాబు నాయుడుకు గాని లేదని చెప్పుకొచ్చారు. చంద్రబాబుకి రాజకీయ భిక్ష పెట్టింది వైయస్ రాజశేఖర్ రెడ్డి అంటూ గుర్తు చేశారు.ఏ తప్పు చేయని వ్యక్తి, ఎవరికీ భయపడినటువంటి వ్యక్తి వైఎస్ జగన్ ను అన్యాయంగా కేసుల్లో ఇరికించారని, 16 నెలల పాటు జైల్లో పెట్టారని ఆరోపణలు గుప్పించారు.

 

ఆ సమయంలో కాంగ్రెస్ నాయకులు ఎవరూ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి గెలవడానికి చంద్రబాబు నాయుడు సహకారం అందించాలని అక్రమంగా డబ్బులు పంపించారని విమర్శలు చేస్తూ తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు.అయితే ఒక పక్క వైసిపి నాయకులు ఇటువంటి విమర్శలు చేస్తుంటే మరోపక్క వైఎస్సార్ కుమార్తె షర్మిల వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరింది తండ్రిని చంపిన పార్టీలో కూతురు ఎందుకు చేరుతుంది అంటూ తిరిగి కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -