Rakul Preet Singh: రకుల్ కి 3 కోట్లు విలువ చేసే కార్ ని బహుమతిగా ఇచ్చిన స్టార్ హీరో.. ఆ రీజన్ వల్లే కారు ఇచ్చాడా?

Rakul Preet Singh:  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. కెరటం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రకుల్ ఆ తర్వాత వరుసగా అవకాశాలను అందుకుంటూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత చిన్న వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. తర్వాత ఈ ముద్దుగుమ్మ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా రాలేదు.. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా పదుల సంఖ్యలో సినిమాలలో నటించి అక్కడ కూడా టాప్ హీరోయిన్గా రాణిస్తోంది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ హాలీవుడ్ నటుడు జాకీ భగ్నానితో ప్రేమలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇద్దరు కలిసి వెకేషన్ లు తిరుగుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం రకుల్ కేవలం బాలీవుడ్ లో మాత్రమే సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.. టాలీవుడ్ లో చివరగా కొండ కులం సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఇది ఇలా ఉంటే తాజాగా రకుల్ దాదాపు మూడు కోట్లు విలువ చేసే బెంజ్ కార్ ని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి.

ఈ కార్ పక్కన రకుల్ చాలా స్టైల్ గా ఫోజులు ఇచ్చింది. అయితే ఈ కార్ ని ఆమె తన సొంత డబ్బులతో కొనుక్కోలేదట, ఒక ప్రముఖ తమిళ స్టార్ హీరో ఆమెకి గిఫ్ట్ గా ఇచ్చాడని టాక్. గత కొంతకాలం నుండి రకుల్ ప్రీత్ సింగ్ ఆ స్టార్ హీరోతో ప్రేమాయణం నడుపుతుందని టాక్. ఈమధ్య కాలంలో ఇద్దరూ చాలా బహుమతులు పంచుకున్నారట. అందులో ఈ కార్ కూడా ఒకటి, అయితే ఆ హీరో ఎవరు ఏమిటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -