Ram Gopal Varma: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనాత్మక దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు రామ్ గోపాల్ వర్మ.

Ram Gopal Varma: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనాత్మక దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు రామ్ గోపాల్ వర్మ. ఈయన ఒకప్పుడు టాలీవుడ్ సినిమాలు మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమాలకు కూడా దర్శకుడుగా పనిచేసే ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో రాంగోపాల్ వర్మ సినిమాలపై ఫోకస్ తగ్గించారని తెలుస్తోంది. అయితే నిత్యం ఈయన ఏదో ఒక విషయం ద్వారా సోషల్ మీడియా వార్తల్లో మాత్రం పాపులర్ అవుతున్నారు.

రాంగోపాల్ వర్మ ఎవరి గురించి అయినా ఏ విషయం గురించి అయినా మాట్లాడిన పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సంచలనం అవుతుంది. ఈ క్రమంలోనే ఈయన చేసే పోస్టులు కూడా అలాగే వైరల్ అవుతూ ఉంటాయి. ఇదిలా ఉండగా గత రెండు రోజుల క్రితం నిఖిల్ నటించిన కార్తికేయ2 సినిమా గురించి మాట్లాడుతూ సినిమా పై ప్రశంసలు కురిపించడమే కాకుండా, అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్,రాజమౌళి ప్రశాంత్ నీల్ సినిమా గురించి షాకింగ్ కామెంట్ చేశారు.

ఈ హీరోలు దర్శకులు నటించిన సినిమా కన్నా కార్తికేయ 2 సినిమా రెండింతలు అద్భుతంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్మ ఈ సినిమా గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.RRR సినిమా చూస్తుంటే తనకు సర్కస్ లా అనిపించిందని కామెంట్ చేశారు.మనం సర్కస్ చూడటానికి వెళ్ళినప్పుడు ఎలాంటి ఆనందం ఆతృత కలుగుతుందో తనకు ఈ సినిమా చూస్తున్నప్పుడు కూడా అలాంటి ఆనందం ఆతృత కలిగిందని తెలియజేశారు.

ముఖ్యంగా ఈ సినిమాలో రామ్ చరణ్ ఎన్టీఆర్ వంతెన దగ్గర బాలుడిని కాపాడిన సన్నివేశంలో రామ్ చరణ్ ఎన్టీఆర్ జెమినీ సర్కస్ చేస్తున్నారనే భావన కలిగిందని ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ RRR సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ కామెంట్స్ పై ఇటు రామ్ చరణ్ అభిమానులు, అటు తారక అభిమానులు పెద్ద ఎత్తున రామ్ గోపాల్ వ్యవహారి శైలి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -