RGV Vyooham Movie: రామ్ గోపాల్ వర్మ వ్యూహం, శపథం అసలు లెక్కలివే.. జగన్ కు మేలు చేయాలనే ఇలా చేశారా?

RGV Vyooham Movie: అధికారం ఉంది కనుక ఏం చేసిన చెల్లిపోతుందని జగన్ అనుకుంటున్నారో ఏమో కానీ.. ఆయన చర్యలపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. వ్యూహం సినిమా విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అందరినీ నివ్వెరబోయేలా చేస్తున్నాయి. అటు జగన్, ఇటు ఆర్జీవి గురించి ఇద్దరూ ఇద్దరే అని అనుకుంటున్నారు. జగన్ కు రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసం ఆర్జీవీ వ్యూహం సినిమా తీశారు. లీగల్ గా ఆ సినిమా చాలా సమస్యలను ఎదుర్కొంది. అసలు విడుదల అవుతుందో లేదో తెలియదని అనుకున్నారు. కానీ, ఆ సినిమా మొత్తానికి ప్రేక్షకులు ముందుకు వచ్చింది. వచ్చిన సంగతి ఎవరికీ తెలియదు. ఎప్పుడు వచ్చిందో తెలియదు. సినిమా టాక్ ఏంటో కూడా తెలియదు. తప్పదు కనుక కొంత మంది క్రిటిక్స్ కి సినిమా చూపించారు.

ఆ సినిమాలో కొన్ని సీన్లు ట్రోలర్స్‌కి మంచి ఫీడ్ ఇస్తుందని చెబుతున్నారు. అయితే.. ఈ సినిమాలో జగన్‌ను ఆర్జీవీ మహానుభావుడిగా చూపించారు. అక్కడితో ఎవరికీ ఎలాంటి సమస్య లేదు. కానీ. చంద్రబాబు, పవన్ ను చూపించిన తీరుపై అన్ని వర్గాల్లో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. టీడీపీ, జనసేన వర్గాల్లో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అలాంటి సినిమాను రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన ఏపీ ఫైబర్‌నెట్‌లో విడుదల చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసుస్తుంది. ఈ సినిమాను ఆడియన్స్ తిరస్కరించారు. దీంతో.. ఫైబర్ నెట్ ద్వారా ప్రతీ ఇంటి పంపించాలని జగన్ వ్యూహం రచిస్తున్నారు. ఈ సినిమా జగన్ కు లబ్ధి చేకూర్చడానికే అని ఆర్జీవీ చెబుతున్నారు. అలాంటప్పుడు ప్రభుత్వ సంస్థ ద్వారా దీన్ని ఎలా టెలికాస్ట్ చేస్తారో వైసీపీ అధినేత చెప్పాలి. ఇది ఎన్నికలను ప్రభావితం చేస్తుందనడంలో అనుమానం లేదు. అంతేకాదు.. దీని వలన ఎన్నికల్లో గొడవలు జరిగి అవకాశం కూడా ఉంది.

ఇప్పటికే చంద్రబాబు, పవన్ క్యారక్టరైజేషన్ పై టీడీపీ, జనసేన వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాంటిది ఎన్నికలకు ముందు ఈ సినిమాను ఫైబర్ నెట్ ద్వారా ఇంటింటికి పంపిస్తే.. సినిమాపై అన్ని పార్టీ శ్రేణుల మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో గొడవలకు ఆస్కారం ఉంటుంది. బాధ్యతాయుతమైన సీఎంగా ఉండి జగన్ ఇలాంటి చర్యలను ప్రోత్సహించడ సరికాదని అన్ని వర్గాలు విమర్శిస్తున్నాయి. వ్యూహం సినిమాను 2 పార్టులుగా తీయడంతో పాటు.. అందులో విషయాన్ని మరింత లోతుగా చూపించడానికి శపథం పేరుతో మరో రెండు చాప్టర్ల వెబ్ సిరీస్ కూడా రూపొందించారు. వ్యూహం సినిమాకు అద్దె చెల్లించిన వారికి శపథం వెబ్ సిరీస్ లింక్ కూడా ఉచితంగా అందిస్తారు. ఇలా ప్రజలను ఎన్నికల్లో ప్రభావితం చేయడానికి జగన్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -