Rashmi: పడక సుఖంపై రష్మీ సంచలన వ్యాఖ్యలు వైరల్!

Rashmi: మల్లెమాల ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో ఈటీవీలో ప్రసారమయ్యే కామెడీ షో జబర్దస్త్ ద్వారా బుల్లితెరపై యాంకర్‌గా అడుగుపెట్టింది రష్మీ. హాట్ యాంకర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. అనసూయతో సరిసమానంగా బుల్లితెరపై ప్రేక్షకులను సంపాదించుకుంది. ఆ తర్వాత సినిమాల్లోకి కూడా అడుగుపెట్టి వెండితెరపై కూడా కనిపించింది. కానీ రెండు, మూడు సినిమాల్లో ఈ హాట్ యాంకర్ నటించగా.. సిల్వర్ స్క్రీన్‌పై మాత్రం అంతగా రాణించలేకపోయింది. ఆమె నటించిన గుంటూరు టాకీస్‌తో పాటు మిగతా సినిమాలు అంతగా ఆడలేదు.

సినిమాలలో సక్సెస్ కాకపోవడంతో.. ఇక బుల్లితెరకు మాత్రం రష్మీ పరిమితమైంది. టీవీలో జబర్దస్త్‌తో పాటు ఇతర షోలలో పాల్గొంటూ ప్రేక్షకులను అలరిస్తోంది. దాదాపు 8 ఏళ్లుగా జబర్తస్‌లోనే రష్మీ కొనసాగుతోంది. ఆమె జబర్దస్త్‌కు గుడ్ బై చెబుతుందని చాలా వార్తలు వచ్చాయి. కానీ తాను జబర్దస్త్‌ను వదిలిపెట్టేది లేదని, ఉన్నన్నీ రోజులు అందులోనే ఉంటానంటూ చెప్పుకొచ్చింది.

పరస్పరం ఒప్పుకుని చేసుకుంటే తప్పేంటి?

అయితే తాజాగా ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మి హాట్ కామెంట్స్ చేశారు. కాస్టింగ్ కౌచ్‌పై స్పందించిన ఆమె.. పరస్పరం ఒప్పుకుని చేసుకుంటే తప్పేంటి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎదుటివారు ఒప్పుకోకుండా ఏ పని జరగదని, అలాంటప్పుడు కాస్టింగ్ కౌచ్ అనే పేరు దానికి పెట్టడం అర్థరహితమని రష్మీ తెలిపింది. ఒకరి సపోర్ట్ లేకుండా ఏ ఇండస్ట్రీలోనైనా ఎదగడం కష్టమని రష్మీ చెప్పుకొచ్చింది.

దీంతో రష్మి వ్యాఖ్యలపై బుల్లితెర వర్గాలు, నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వస్తోన్నాయి. కాస్టింగ్ కౌచ్‌కు సపోర్ట్ గా ఆమె మాట్లాడటం విమర్శలకు దారి తీస్తోంది. అసలు కాస్టింగ్ కౌచ్ అనేది లేదంటూ ఆమె వ్యాఖ్యలు చేసింది. ఇద్దరూ ఒప్పుకుని ఏ పని చేసుకున్న తప్పు లేదంటూ చేసిన కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. రష్మికి అవకాశాలు వస్తున్నాయని కాబట్టి ఏదైనా మాట్లాడుతుందని, కానీ కొత్తవాళ్ల పరిస్థితి ఏంటని మండిపడుతున్నారు.రష్మి ఎప్పుడూ ఓపెన్ గా మాాట్లాడుతూ ఉంటుంది. బోల్డ్ గా మాట్లాడుతూ వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -