Rashmika: ముద్దుల తుఫానులో రష్మిక.. ఆ విషయంలో ఎక్కడా తగ్గడం లే!

Rashmika: రష్మిక ఏ ముహూర్తాన టాలీవుడ్ లో అడుగు పెట్టిందో కానీ ఇప్పటివరకు టాలీవుడ్ పై దుమ్ము రేపుతూనే ఉంది. తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్ లోకి వెళ్లిన విషయం కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు రణబీర్ కపూర్, రష్మిక హీరోయిన్ గా యానిమల్ అనే సినిమా తీస్తున్నాడు దర్శకుడు సందీప్ వంగా. ఇది కూడా అందరికీ తెలిసిందే కదా ఇందులో లేటెస్ట్ అప్డేట్ ఏముంది అంటే నిజంగానే లేటెస్ట్ అప్డేట్ ఉంది.

అదేంటంటే అక్టోబర్ 11 వ తారీఖున యానిమల్ సినిమా నుంచి అమ్మాయి అనే సాంగ్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఇందులో రణబీర్, రష్మిక ల ముద్దులు మెయిన్ హైలెట్.ఈ మధ్య కాలం లో ముద్దు సన్నివేశాలు అనేవి కామన్ అయిపోయాయి. హీరోయిన్స్ కూడా ఏమాత్రం తగ్గకుండా ముద్దు పెడతాం, పెట్టించుకుంటాం అంటూ రొమాన్స్ ని వేరే లెవెల్లో పండిస్తున్నారు ఇక రష్మిక కూడా ముద్దుల విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు.

ముద్దుల తుఫాను కురిపిస్తూనే ఉంది. డియర్ కామ్రేడ్ సినిమా అప్పుడు ఇదే ముద్దు సీన్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఫ్యాన్స్. అయినా ఏమాత్రం పట్టించుకోని రష్మిక తెలుగులో డియర్ కామ్రేడ్ సినిమాలో హాట్ హాట్ కిస్ సీన్లు చేసింది. అయితే యానిమల్ చిత్రంలో మాత్రం ఆమె కిస్ సీన్లని కొత్త రేంజ్ కి తీసుకు వెళ్లిందని చెప్పాలి. ఇందులో రష్మిక, రణబీర్ ఇద్దరూ ఫ్లైట్లో కిస్ చేసుకుంటారు. ఇది చూసిన ప్రేక్షకులు ఇన్నాళ్ళు బళ్ళు మీద, కార్ల మీద ముద్దుల సీన్లు చూసి తరించాము.

ఇక ఇప్పుడు ఫ్లైట్ లో చూస్తున్నాం అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇంతకుముందు బాలీవుడ్లో గుడ్ బై, మిషన్ మజ్ను వంటి సినిమాలు చేసింది రష్మిక. బాలీవుడ్ కెరియర్ లో పెద్ద సినిమాగా యానిమల్ చిత్రాన్ని చెప్పుకోవచ్చు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా హిట్ అయితే కనుక రష్మిక బాలీవుడ్ లో తిరుగులేని స్టార్ డం సొంతం చేసుకుంటుంది.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: నవ సందేహాల పేరుతో జగన్ కు లేఖ రాసిన షర్మిల.. ఏకు మేకులా గుచ్చుకుంటోందా?

YS Sharmila:  వైయస్ షర్మిల ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీ ప్రచార కార్యక్రమాలలోను అలాగే పార్టీ వ్యవహార కార్యక్రమాలలో కూడా ఎంతో బిజీగా మారిపోయారు. ఈ విధంగా వైఎస్...
- Advertisement -
- Advertisement -