Sandeep: వెళ్లి నీ మాజీ భర్తను అడుగు.. సందీప్ షాకింగ్ కౌంటర్ వైరల్!

Sandeep: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ మూవీ రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఏకంగా తొమ్మిది వందల కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. అయితే ఈ సినిమాపై చాలామంది ప్రశంసల వర్షం కురిపించారు కానీ మరి కొంతమంది విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. ఈ సినిమా గురించి పార్లమెంటులో కూడా చర్చ జరిగింది.

 

ఇలాంటి చిత్రాల వల్ల సమాజానికి తీవ్ర స్థాయిలో ముప్పు తప్పదని మహిళా ఎంపీలు అభిప్రాయపడ్డారు. అలాగే తాప్సీ, కస్తూరి,రాధిక వంటి సినీ తారలు కూడా ఈ సినిమాపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు తాజాగా స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు స్పందించారు. ఈ సినిమా స్త్రీ విద్వేషంతో నిండి ఉందని వెల్లడించింది. బాహుబలి 2, కబీర్ సింగ్ సినిమాలు సైతం స్త్రీల పట్ల ద్వేషం వేధింపులను ప్రోత్సహించే లాగా ఉన్నాయని ఆరోపించారు.

అయితే దీనిపై యానిమల్ సినిమా దర్శకుడు రెడ్డి వంగ తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చాడు. నేరుగా కిరణ్ రావు పేరుని ప్రస్తావించకుండా తన సినిమాలు గురించి విమర్శించే ముందు అమీర్ ఖాన్ నటించిన దిల్ సినిమా చూడాలని సలహా ఇచ్చారు. నా సినిమాలు గురించి విమర్శించే ఆమెకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీరు ముందుగా అమీర్ ఖాన్ నటించిన దిల్ సినిమా చూడండి.

 

ఆ సినిమాలో ఆయన దాదాపు అమ్మాయిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నిస్తారు ఆ అమ్మాయి ఇదే తప్పు అనేలా చూపించే ప్రయత్నం చేస్తారు కానీ అదే అమ్మాయి చివరికి అతడితో ప్రేమలో పడుతుంది.ఆ సినిమాను ఎలా అర్థం చేసుకోవాలి ముందు ఇలాంటి సినిమాలు గురించి మాట్లాడిన తర్వాత మా సినిమాలు గురించి మాట్లాడితే బాగుంటుంది. దీని గురించి వెళ్లి మీ మాజీ భర్తని అడగండి అని దుమ్ము దులిపేశాడు.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -