Tiger Nageswara Rao: టైగర్ నాగేశ్వరరావు మూవీ .. రవితేజ ఖాతాలో భారీ బ్లాక్ బస్టర్ చేరినట్టేనా?

Tiger Nageswara Rao: టాలీవుడ్ హీరో మాస్ మహారాజ రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ లభించింది. సినిమా స్టోరీ పాయింట్ ని పూర్తిగా రివీల్ చేయకున్నా కూడా స్టువర్ట్ పురంలో ఉండే ఒక మామూలు దొంగ ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ దొంగగా ఏ విధంగా మారాడు. దానికి కారణం ఏంటి అనేది సినిమా స్టోరీగా చెబుతున్నారు.

అయితే రవితేజ తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడన్న వాదనలు వినిపిస్తున్నాయి. యాక్షన్ సీన్స్, ఎలివేషన్ సీన్స్ తో దుమ్ము లేపాడని అంటున్నారు ప్రేక్షకులు. ఇకపోతే సినిమాలో ఫస్టాఫ్ స్టార్ట్ అవ్వడం ఆసక్తిగా స్టార్ట్ అయ్యి తర్వాత స్లో డౌన్ అయ్యి తిరిగి ప్రీ ఇంటర్వెల్ నుంచి ఊపుందుకుంది.మూవీ ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగా వర్కౌట్ అవ్వగా సెకెండ్ ఆఫ్ అక్కడక్కడా ఆసక్తికరమైన సీన్స్ తో అలాగే కొన్ని చోట్ల కొంచం లెంత్ వలన లాగ్ అయినట్లు అనిపించింది అంటున్నారు.

రియల్ స్టోరీ కి కొన్ని ఫీక్చనల్ సీన్స్ ను యాడ్ చేసి తీసిన టైగర్ నాగేశ్వరరావు సినిమా లెంత్ పరంగా మరీ ఎక్కువ అయిన ఫీలింగ్ కలిగింది అంటున్నారు, అలాగే కోర్ పాయింట్ ఆసక్తిగా ఉన్నా కూడా స్క్రీన్ ప్లే కొంచం కన్ఫ్యూజింగ్ గా అలాగే కొంచం సాగదీసినట్లు అనిపించింది అన్న కంప్లైంట్ వినిపిస్తున్నాయి. ఓవరాల్ గా సినిమా పరంగా రవితేజ పెర్ఫార్మెన్స్, మాస్ ఎలివేషన్స్, కొన్ని ఆసక్తికరమైన సీన్స్ తో సినిమా సీన్స్ వైజ్ ఉన్నంతలో బాగానే మెప్పించింది అంటున్నారు.

మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా పరవాలేదు అనిపించేలా ఉంది అంటున్నారు ప్రేక్షకులు. మొత్తంగా ప్రీమియర్స్ నుండి పర్వాలేదు అనిపించేలా రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా ఇక రెగ్యులర్ షోలకు ఆడియన్స్ నుండి ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుంది. ఏ మేరకు కలెక్షన్లను రాబడుతుంది అన్నది చూడాలి మరి. ఒక రకంగా చెప్పాలంటే రవితేజ కి ఇది సూపర్ హిట్ మూవీ అని చెప్పాలి..

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -