Leo, Bhagavanth Kesari, Tiger Nageswara Rao: లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు.. ఏ సినిమా వల్ల ఎంత లాభం వచ్చిందో తెలుసా?

Leo, Bhagavanth Kesari, Tiger Nageswara Rao: దసరాకి భగవంత్ కేసరి, లియో, టైగర్ నాగేశ్వరరావు మూడు సినిమాలు ఒకేసారి వచ్చి బాక్స్ ఆఫీస్ లో మంచి టాక్ నే అందుకున్నాయి. దసరాకి మూడు సినిమాలు హిట్ అవ్వడం అనేది తెలుగు ఆడియోన్స్ కి చాలా ఆనందకరమైన విషయం. లియో విషయానికి వస్తే ఇది తమిళ్ సినిమా అయినప్పటికీ కూడా సితార ఎంటర్టైన్స్ దీన్ని తెలుగులో రిలీజ్ చేసినందువలన పెద్ద మొత్తం లో థియేటర్లలో రిలీజ్ చేశారు.

అందులోని ఈ సినిమా మీద ముందు నుంచే చాలామందికి చాలా అంచనాలు ఉన్నాయి. కనుక ఈ సినిమాకి రికవరీ కూడా బానే అయిపోయింది. బయ్యర్స్ కి కూడా లాభాలు బానే మిగిలాయి. మరోవైపు టైగర్ నాగేశ్వరరావు సినిమా చాలా తక్కువ బడ్జెట్ తో తీశారు. 70 నుంచి 80 కోట్ల లోపలే సినిమా అయిపోయింది. ఇది పాన్ ఇండియా సినిమా కనుక ప్రతి భాషలోని రిలీజ్ చేశారు.

థియేటర్ రైట్స్ 50 కోట్లు అవడంతో ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్స్ రావడంతో ఇది కూడా ఫ్లాప్ టాక్లో నుంచి బయటకు వచ్చి డీసెంట్ కలెక్షన్స్ ని సంపాదించింది. ఇంక భగవంత్ కేసరి విషయానికొస్తే దీన్ని 130 కోట్లతో తీశారు. ఇందులోని కేవలం 70% వరకే మొదటివారం కలెక్షన్లు అందుకుంది ఈ సినిమా.

కానీ రెండోవారం కూడా కొంచం కొంచం రావడంతో ఈ శని, ఆదివారాలు ఇంకా ఏ సినిమాలు లేకపోవడంతో ఈ సినిమానే ఎక్కువ కలెక్ట్ చేసింది కనుక బయర్స్ కి కూడా అంత నష్టాలేమీ లేకుండా బానే రికవర్ అయిపోయింది. మరి వచ్చేవారం నుంచి చిన్న సినిమాలు విడుదలకి దగ్గర పడుతున్నాయి. ఆ సినిమాలు వస్తే మరి ఈ సినిమాలకు కలెక్షన్లు తగ్గిపోతాయి. కనుక ఈ లోపల మూడు మిగిలిన ప్రాఫిట్లను కూడా రికవరీ చేసుకోవాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -