Ravi Teja: రవితేజ దెబ్బకు ఆ స్టార్ ప్రొడ్యూసర్ ఆస్తులన్నీ అమ్ముకున్నాడా.. ఏం జరిగిందంటే?

Ravi Teja:  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు రవితేజ ఒకరు రవితేజ ఒకరు. ఈయనకు సినిమాలపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే కెరియర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి ఈయన అనంతరం హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన తాజాగా టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా అక్టోబర్ 20వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఈ సినిమా నిడివి ఎక్కువగా ఉండటం లేక సినిమా కథ ప్రేక్షకులకు అర్థంకాకనో మొదటి షో నుంచి కూడా నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇలా ఈ సినిమా నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్న తర్వాత మేకర్స్ రన్ టైం కుదించారు. అయితే అప్పటికే జరగాల్సిన డామేజ్ మొత్తం జరిగిపోయింది.

ఇక ఈ సినిమాకి భారీ స్థాయిలో నష్టాలు రావడంతో నిర్మాత కూడా భారీ స్థాయిలో నష్టపోయారని తెలుస్తుంది ఈ సినిమా కోసం ఈ సినిమా ద్వారా జరిగిన నష్టాలను పూడ్చడం కోసం నిర్మాత కొన్ని ఆస్తులను కూడా అమ్ముకున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా కారణంగా నిర్మాత నష్టపోయారని రవితేజ తన రెమ్యూనరేషన్ లో కొంత భాగం తిరిగి వెనక్కి ఇచ్చేసారని సమాచారం.

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా రవితేజ ఇండస్ట్రీ లోకి రావడంతో కష్టం విలువ బాగా తెలుసు. అందుకే ఈయన తన సినిమాల కారణంగా ఎవరైనా నష్టపోయారనే విషయం తెలిస్తే మాత్రం తన రెమ్యూనరేషన్ లో కొంత భాగం తిరిగి వెనక్కి ఇచ్చేస్తూ ఉంటారు. అలాగే టైగర్ నాగేశ్వరరావు విషయంలో కూడా అభిషేక్ అగర్వాల్ కి కొంత మొత్తంలో రెమ్యూనరేషన్ తిరిగి వెనక్కి ఇచ్చారని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -