Ravi Teja: రవితేజ ఫోటో అడిగితే అవమానించిన నటుడు.. 25 ఏళ్ల తర్వాత అతనికే రవితేజ ఛాన్స్ ఇవ్వడంతో?

Ravi Teja: ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు రవితేజ ఒకరు ఈయన సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కెరియర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గాను అలాగే పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను నటించారు ప్రస్తుతం హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటున్నారు.

ఇక ఈ దసరా సందర్భంగా రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి పోస్టర్స్ ట్రైలర్ కనుక చూస్తే ఈ సినిమా ద్వారా రవితేజ మంచి సక్సెస్ అందుకుంటారని అందరూ భావిస్తున్నారు. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నటువంటి నేపథ్యంలో సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ రవితేజ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

దాదాపు 25 సంవత్సరాల క్రితం తాను ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలో రవితేజ తన వద్దకు వచ్చి ఒక ఫోటో అడిగారట అయితే అప్పుడు రవితేజతో ఫోటో దిగడానికి ఈయన ఇష్టపడటం లేదని తెలుస్తుంది అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత రవితేజ తనకు సినిమాలో నటించే అవకాశం కల్పించారంటూ ఈయన తెలియజేయడమేకాకుండా అప్పుడు రవితేజతో అలా ప్రవర్తించినందుకు క్షమాపణలు కూడా చెప్పారు.

ఇలా ఒకప్పుడు తనని అవమానించిన నటుడికి రవితేజ ఇప్పుడు తన సినిమాలో అవకాశం కల్పించారు అంటే రవితేజ ఇండస్ట్రీలో ఎలాంటి సక్సెస్ అందుకున్నారో తెలుస్తోంది. ఇలా రవితేజ సక్సెస్ గురించి తెలిసి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ధమాకా తర్వాత మరో రెండు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి రవితేజకు పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు. అయితే టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ఈయన తప్పనిసరిగా హిట్ కొట్టాలన్న ఆలోచనలోనే ఉన్నారు మరి ఈ సినిమా రవితేజకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -