Ravi Teja: రవితేజ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కట్లేదా.. ఏమైందంటే?

Ravi Teja: టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ హీరోగా పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి నటుడు రవితేజ ఎప్పుడు సరికొత్త కథ చిత్రాలను ఎంపిక చేసుకుని ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు. ఇక రవితేజ ఎక్కువగా మాస్ సినిమాలలో నటిస్తుండడంతో ఈయనకు మాస్ మహారాజా అనే పేరు కూడా ఉంది అయితే రవితేజ ఎప్పుడు ఒకే ధోరణి సినిమాలు కాకుండా ప్రయోగాత్మక చిత్రాల ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

 

ఇలా ఎప్పుడు ఒకే తరహా సినిమాలు చేస్తే బోర్ కొడుతుందన్న ఉద్దేశంతోనే ఈయన విభిన్నమైన కథలతో వచ్చే డైరెక్టర్లను ప్రోత్సహిస్తూ వారికి అవకాశాలు ఇవ్వడమేకాకుండా పలు ప్రయోగాత్మక సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని భావిస్తారు. ఇలా భావించడమే రవితేజకు శాపంగా మారుతోందని చెప్పాలి.

రవితేజ నటించిన ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలన్నీ కూడా ఆయనకు ఏవి సరైన ఫలితాలను అందివ్వలేకపోయాయి. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీ నుంచి మొదలుకొని నేడు ఈగల్ వరకు ప్రతి ప్రయోగాత్మక సినిమా కూడా ఈయనను నిరాశపరిచిందనే చెప్పాలి. ఈగల్ సినిమా అద్భుతమైనటువంటి యాక్షన్ సన్ని వేషాలతో డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఎంతో అద్భుతంగా ఈ సినిమాని తెరకెక్కించారు.

 

ఈ సినిమా హాలీవుడ్ సినిమాని తలపించేలా యాక్షన్స్ సన్ని వేషాలను తీశారు అయితే స్క్రీన్ ప్లే మాత్రం చాలా స్లోగా ఉందని డైలాగ్స్ కూడా పెద్దగా సింక్ అవ్వడం లేదని చెప్పాలి. కేవలం యాక్షన్ ని నమ్ముకొని ఈ సినిమాని తెరపైకి తీసుకువచ్చారు. కార్తిక్ అయితే ఈ సినిమా కూడా పెద్దగా ఫలితాలను ఆకట్టుకోలేక పోతుందని ఈ సినిమా విషయంలో కూడా రవితేజ నిరాశను ఎదుర్కొనే పరిస్థితిలే కనపడుతున్నాయి అంటూ సినీ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -