Eagle: ఈగల్ సినిమాతో మాస్ మహారాజ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఖాయమా?

Eagle: టాలీవుడ్ లో హిట్లు ఫ్లాప్ లతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోలలో రవితేజ ఒకరు. కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా అదే విధానాన్ని ఫాలో అవుతున్నారు. ఇంకా తేడా అది మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన రవితేజ లేటెస్ట్ గా ఈగల్ మూవీ తో రాబోతున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫుల్ అంత యాక్షన్ తో రూపొందించింది.

 

షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ మూవీ ని సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ దిల్ రాజు కోరిక మేరకు సంక్రాంతి పోటీ నుంచి తప్పుకోవలసి వచ్చింది. దీంతో ఫిబ్రవరి 9కి వాయిదా పడింది ఈ సినిమా. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటం మూవీ యూనిట్ ప్రమోషన్ లో స్పీడ్ పెంచింది.

నిన్ననే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సినిమాలో రవితేజ లవ్ ట్రాక్ హైలెట్ గా ఉండబోతుందని టాక్ వచ్చింది. ఏ తెలుగు సినిమాలో చూడని విధంగా మేకర్స్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

 

ఈ మూవీలో పత్తి పండించే వ్యవసాయదారుడుగా రవితేజ కనిపిస్తాడట, పత్తి రైతుల సమస్యలపై పోరాడుతాడట, పత్తి మాఫియాను అంతం చేస్తారట. వీళ్ళందర్నీ కంగారు పెట్టింది పత్తి, ప్రాంతము కాదు. దాన్ని పండించేవాడు అంటూ ట్రైలర్ లో అనుపమ చెప్పిన డైలాగులు ఫ్యాన్స్ కి పిచ్చపిచ్చగా నచ్చేసాయి. వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న రవితేజ ప్రస్తుతం సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.

 

గత ఏడాది చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో గెస్ట్ రోల్ లో నటించారు రవితేజ. ఆ సినిమా హిట్ అయినప్పటికీ క్రెడిట్ రవితేజ కి రాకుండా పోయింది. తర్వాత వచ్చిన టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర సినిమాలో రెండు రవితేజ ని నిరాశపరిచాయి. దీంతో ఈగల్ సినిమాతో గట్టి కం బ్యాక్ ఇవ్వాలని ట్రై చేస్తున్నారు రవితేజ. మరి ఈ సినిమా భవిష్యత్తు తెలియాలంటే ఇంకో నాలుగు రోజులు ఆగాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -