Ravi Teja: అన్నయ్య అని పిలిచిన అనుపమ.. రవితేజ రియాక్షన్ ఇదే!

Ravi Teja: ఫిబ్రవరి 9న ఈగల్ సినిమాతో రవితేజ మన అందరి ముందుకు వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రవితేజ, అనుపమ పరమేశ్వరన్,నవదీప్, అవసరాలు శ్రీనివాస్ మరి కొంతమంది ఆర్టిస్టులతో చిన్న ఇంటర్వ్యూ లాగా ప్లాన్ చేశారు. అయితే ప్రమోషన్స్ లో భాగంగా అన్ని సినిమాలకు ఏదో ఒక రకంగా ఇంటర్వ్యూలు చేస్తారు కదా ఇందులో కొత్త ఏముంది అనుకుంటున్నారా.. ఇంటర్వ్యూ కొత్త కాదు కానీ ఇందులో రవితేజ ఎనర్జిటిక్ కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.

 

రవితేజ అంటేనే ఎనర్జీకి బ్రాండ్ అంబాసిడర్ అలాంటి రవితేజ అనుపమతో వేసిన పంచ్ లు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే డైరెక్టర్ కార్తీక్ గురించి మాట్లాడుతూ అనుపమ పరమేశ్వరన్ కార్తీక్ అన్నయ్య అని పిలిచింది. అయితే రవితేజ ఒకలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తూ అందమైన అమ్మాయిలు బేసిగ్గా అన్నయ్య అనే పదాన్ని వాడకూడదు.

ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అంటాడు. నువ్వు అన్నయ్య అని పిలవడం పట్ల కార్తీక్ ఫీలింగ్స్ ఏంటో మనం తర్వాత అడిగి తెలుసుకుందాం అంటాడు. తర్వాత కార్తీక్ అని అనుపమ క్యూట్ గా పిలవడంతో చూసావా ఎంత హాయిగా ఉందో అని కామెంట్ చేశాడు. తర్వాత అనుపమ అతనితో నాలుగు సినిమాలు చేశాను ఆ ర్యాంపో తో అలా పిలుస్తున్నాను అంటుంది. అయితే మాత్రం అన్నయ్య అని పిలిచేస్తావా అంటూ సెటైర్లు వేస్తాడు రవితేజ.

 

పక్కనే ఉన్న అవసరాల శ్రీనివాస్ అయితే మీతో మూడు సినిమాలు చేసి ఆపై సినిమాలు చేయడం మానేస్తాం అనడంతో అక్కడ నవ్వుల సందడి నెలకొంది. ఇది కదా రవితేజ అంటే రవితేజ ఎక్కడ ఉన్నా అక్కడ అట్మాస్ఫియర్ ఇలా పాజిటివ్ గా సరదాగా ఉంటుంది అని చాలామంది సినిమా వాళ్ళు చెప్పారు. ఈ విషయంలో రాజమౌళి కూడా రవితేజని ఒక రేంజ్ లో పొగడటం విశేషం.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -