Movies: ఫిబ్రవరిలో రిలీజ్ కానున్న సినిమాలివే.. ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతాయా?

Movies: పండగ సీజన్ హడావుడి ముగిసిపోయింది. ఇక ఇప్పుడు అందరూ సమ్మర్ సీజన్ లో రాబోయే సినిమాల గురించి చర్చలు మొదలుపెట్టారు. పండగ సీజన్ కి సమ్మర్ సీజన్ కి మధ్యలో ఉండే కాలం లో ఎవరు ఎక్కువగా దృష్టి పెట్టరు. ఎందుకంటే పిల్లలందరూ ఎగ్జామ్స్ హడావుడి, ఉద్యోగస్తులకు ఇయర్ ఎండింగ్ హడావుడి. ఇలా ఎవరి హడావుడిలో వాళ్ళు ఉంటారు అందుకే ఈ సీజన్లో సినిమాలు రిలీజ్ చేయడానికి మూవీ మేకర్స్ పెద్దగా ఇష్టపడరు.

 

అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఫిబ్రవరి నెల మూవీ మేకర్స్ పంట పండిస్తుంది. గత నాలుగు సంవత్సరాలుగా ఫిబ్రవరి నెలలో రిలీజ్ అయిన ఏదో ఒక సినిమా ఇండస్ట్రీ హిట్ కొడుతుంది. 2020 నుంచి సాంప్రదాయం మొదలైంది. 2020లో భీష్మ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. నితిన్ కెరియర్ కి ప్రాణం పోసింది అలాగే 2021 ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఉప్పెన సినిమా ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే.

అందులో నటించిన యాక్టర్లు, డైరెక్టర్ బుచ్చిబాబు ఓవర్ నైట్ స్టార్లు అయిపోయారు ఇక 2022 ఫిబ్రవరిలో రిలీజ్ అయిన సినిమా డిజె టిల్లు. అప్పటికే ఎన్నో సంవత్సరాలుగా సినిమాలు చేస్తున్నప్పటికీ సిద్దుయాక్టర్ గా ఎవరికి తెలియదు. కానీ డిజె టిల్లు ఏ రేంజ్ లో హిట్ అయిందంటే సిద్దు జొన్నలగడ్డ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. 2023 ఫిబ్రవరి నెలలో సార్ సినిమా రిలీజ్ అయింది ఇది కూడా ఘన విజయాన్ని సాధించి ఇండస్ట్రీ హిట్ కొట్టింది.ఇక ఈ సంవత్సరం ఫిబ్రవరిలో అంబాజీపేట మ్యారేజి బ్యాండ్, బూట్ కట్ బాలరాజు, ధీర, హ్యాపీ ఎండింగ్ లాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

 

సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాపై అందరికీ ఒక మోస్తరు అంచనాలు ఉన్నాయి. ఫిబ్రవరి రెండో వారంలో యాత్ర టు, ఈగల్, లాల్ సలాం సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మూడో వారంలో రవితేజ హీరోగా నటించిన ఈగల్ సినిమా రిలీజ్ అవుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ నటించిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా కూడా ఈ వారంలోనే రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక మూడో వారంలో ఆపరేషన్ వాలెంటైన్, ఊరి పేరు భైరవకోన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక నాలుగో వారంలో ప్రస్తుతానికి సుందరం మాస్టర్, మస్తు షేడ్స్ ఉన్నాయి రా లాంటి చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో ఫిబ్రవరి మ్యాజిక్ ఏ సినిమా రిపీట్ చేస్తుందో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -