Sandeep Kishan: ఈగల్ తో పోటీపై సందీప్ కిషన్ రియాక్షన్ ఇదే.. ఏమైందంటే?

Sandeep Kishan: టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ గురించి మనందరికీ తెలిసిందే. తెలుగులో నటించిన తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు సందీప్ కిషన్. ఇది ఇలా ఉంటే వి.ఐ ఆనందదర్శకత్వం లో సందీప్ హీరోగా నటించిన తాజా చిత్రం ఊరు పేరు భైరవకోన. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో జరిగింది. ఈ సందర్భంగా హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ ఎన్నో విషయాల గురించి స్పందించారు. అంతేకాకుండా రవితేజ హీరోగా నటించిన సినిమా విడుదల కావడం విషయం గురించి కూడా స్పందించారు.

ఇలాంటి చిత్రంలో నటించడానికి ఎందుకింత ఆలస్యం చేశారు? అని ప్రశ్నించగా.. ఇలాంటి చిత్రాన్ని తెరకెక్కించడం అంత సులభం కాదు. సమయం, బడ్జెట్‌, శ్రమ.. అన్నీ అధిక మొత్తంలో ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. టైగర్‌ మూవీ తర్వాత ఆనంద్‌తో నేను చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఈ మాట అనడానికి కారణం ఏమిటో.. సినిమా విడుదలయ్యాక మీకే తెలుస్తుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చూడగలిగే చిత్రం ఇది అని తెలిపారు సందీప్. సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ఈగల్‌ మూవీకి సోలో డేట్‌ ఇస్తామని తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, తెలుగు సినీ నిర్మాతల మండలి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

 

మరి, ఆ సినిమా ఇప్పుడు మీతోపాటు రిలీజ్‌కు సిద్ధమైంది. దానిపై స్పందన ఏమిటి? అని ప్రశ్నించగా.. నిజం చెప్పాలంటే.. మేము కూడా సంక్రాంతికే రావాలని అనుకున్నాం. ఆ రేసులో చాలా సినిమాలు ఉండటం చూసి ఇది సరైన సమయం కాదని నిర్ణయించుకుని ఫిబ్రవరికి వెళ్దాం అనుకున్నాం. అప్పటికే ఫిబ్రవరి 9న టిల్లు స్క్వేర్‌ ను ప్రకటించారు. మేము వాళ్లకు ఫోన్‌ చేసి మాట్లాడుకుని రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేశాం. ఈ పరిస్థితుల్లో డేట్‌ మార్చుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే, ఇప్పటికే ఎంతో సమయం తీసుకున్నాం. రవితేజను నేను అభిమానిస్తాను. వి.ఐ.ఆనంద్‌ గత చిత్రం రవితేజతోనే చేశారు. ఈగల్‌’ నిర్మాణ సంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీతో మా నిర్మాతకు సత్సంబంధాలు ఉన్నాయి. ఈగల్‌ రిలీజ్‌ డేట్‌ విషయంలో మాకు ఎలాంటి కాల్స్ రాలేదు. ఒకవేళ వాళ్లు మాకు ఫోన్‌ చేసి మాట్లాడితే స్పందించేవాళ్లం అని తెలిపారు సందీప్ కిషన్. ఈ సందర్భంగా సందీప్ కిషన్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -