Sharmila-Revanth: షర్మిలకు షాకిచ్చిన రేవంత్.. పాలేరు ఇవ్వను ఆ టికెట్ తీసుకోవాలంటూ?

Sharmila-Revanth: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వైయస్సార్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీఅధినేత వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి తన పార్టీని విలీనం చేయబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం గురించి ఇప్పటికే చర్చలు దాదాపు కూడా ఖరారు అయ్యాయని తెలుస్తోంది. ఏ క్షణమైన ఈ విషయాన్ని ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే పార్టీ విలీనం పై ఓ అవగాహనకు వచ్చిన అక్కడ వారి మధ్య కొన్ని షరుతులే అడ్డంగా మారాయని తెలుస్తుంది.

ఇందులో భాగంగా షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి తన పార్టీనీ విలీనం చేస్తే ఆమె ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేలా అడుగులు వేయాలని ఆంక్షలు విధించారట అయితే ఇందుకు షర్మిల ససేమిరా అన్నట్లు తెలుస్తోంది.ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తే తన అన్నయ్య వైఎస్ఆర్సిపి పార్టీకి పెద్ద నష్టం జరుగుతుంది. కనుక ఈమె పూర్తిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపైనే దృష్టి పెట్టారని తెలుస్తోంది.

 

ఇక మొదటి నుంచి కూడా షర్మిల పాలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి దిగుతానంటూ చెప్పుకొస్తున్నారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది.అయితే ఈమెని సికింద్రాబాద్ లోక్ సభ పరిధిలో పోటీ చేసేలా నిలబెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. షర్మిలను ఇక్కడ నిలబెట్టడం వెనుక కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహం ఉందని తెలుస్తుంది.

 

సికింద్రాబాద్ పరిధిలో ఎక్కువగా క్రిస్టియన్స్ ఉండటం వల్ల క్రిస్టియన్స్ ఓట్లు అన్నీ కూడా షర్మిలకే పడతాయి దాంతో సులువుగా ఈమె గెలుపొందవచ్చు.క్రిస్టియన్ ఓట్లు మాత్రమే కాకుండా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు అలాగే వైఎస్ఆర్సిపి అభిమానులు కూడా ఓట్లు వేయడంతో ఎంతో సునాయసంగా గెలవచ్చు అన్న వ్యూహాన్నిరచించిన అధిష్టానం షర్మిలను సికింద్రాబాద్ పరిధిలో ఎన్నికల పోటీకి రంగంలోకి దింపబోతున్నట్లు సమాచారం.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -