Jagan-Sharmila: పులివెందుల పులిబిడ్డకు షాకులు తప్పవా.. ఎన్నికల ఫలితాలు తారుమారు కానున్నాయా?

Jagan-Sharmila: పులివెందుల నియోజకవర్గం లో రాజకీయాలు ఎలా ఉన్నాయి అక్కడ రాజకీయ సమీకరణాలు రోజు రోజుకి ఎలా మారుతున్నాయి అనేదానిపై పెద్ద ఎత్తున ఉత్కంఠత నెలకొంది. ఇక్కడ వైఎస్ కుటుంబానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయనే సంగతి మనకు తెలిసిందే . అయితే ప్రస్తుతం పులివెందుల కడపలో వైయస్ కుమారుడు వర్సెస్ కూతురు అనే విధంగా రాజకీయాలు ఉన్నాయని తెలుస్తోంది.

వైయస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తన చెల్లెలు వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి చేరిన సంగతి మనకు తెలిసిందే. ఇలా కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి వైఎస్ షర్మిల కడప ఎంపీగా వైయస్ అవినాష్ రెడ్డి పై పోటీకి దిగారు. తన బాబాయిని చంపింది వైయస్ అవినాష్ ను జగన్మోహన్ రెడ్డి కాపాడుతూ వస్తున్నారంటూ సునీత షర్మిల బహిరంగంగా ఈ విషయాలను వెల్లడించారు.

వైయస్ వివేక హత్య కేసును అడ్డుపెట్టుకొని కడపలో షర్మిల విజయం సాధించాలనే విధంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తూ ఉండగా అక్కడి నుంచి వైఎస్ సునీతని పోటీకి దింపాలనే ఆలోచనలో షర్మిల ఉన్నారని తెలుస్తోంది.

ఇలా ఇద్దరు అన్నయ్యలకు ఇద్దరు చెల్లెమ్మలు పోటీగా ఎన్నికల బరిలోకి రాబోతున్నారని తెలిసి అక్కడ రాజకీయాలు కాస్త ఆసక్తికరంగా మారాయి. అయితే షర్మిల వ్యాఖ్యలతో అక్కడ వైసిపి అభిమానులు కార్యకర్తలు ఒకింత అసహనానికి గురవుతున్నారు. వైయస్ షర్మిల కనుక వైయస్ అభిమాని అనే ఓటు బ్యాంకును కనక చీల్చారు అంటే తప్పకుండా అవినాష్ రెడ్డికి జగన్ మోహన్ రెడ్డికి షాక్ తప్పదనే చెప్పాలి. కానీ ఇది అంత సులువైన విషయం కాదు అయితే రాజకీయాలలో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Manifesto: జగన్ మేనిఫెస్టోపై జనాభిప్రాయం ఇదే.. బాబోయ్ జగన్ అంటున్న ఏపీ ప్రజలు!

YSRCP Manifesto: శనివారం రోజు మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ మేనిఫెస్టోని విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ ముందు వైసీపీ మేనిఫెస్టో...
- Advertisement -
- Advertisement -