Revanth Reddy: ఆ రెండు పార్టీలకు చెక్ పెట్టేలా మునుగోడులో రేవంత్ భారీ స్కెచ్

Revanth Reddy: మునుగోడు ఉపఎన్నిక ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ బట్టినా దీని గురించే చర్చించుకుంటున్నారు. ఏ నలుగురు కలిసినా.. మునుగోడు ఉపఎన్నిక గురించే మాట్లాడుకుంటున్నారు. మునుగోడు ఉపఎన్నికలో ఎవరు గెలుస్తారనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలు సర్వేలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ తో పాటు రాజగోపాల్ రెడ్డి చేరికతో బీజేపీ కూడా గట్టి పోటీ ఇవ్వనుంది. దీంతో మునుగోడులో త్రిముఖ పోటీ ఖాయంగా కనిపిస్తుంది. ఈ ముక్కోణపు పోటీలో విజయం ఏ పార్టీని వరిస్తుందనేది ఉత్కంఠకరంగా మారింది.

మునుగోడు ఉపఎన్నిక ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ బట్టినా దీని గురించే చర్చించుకుంటున్నారు. ఏ నలుగురు కలిసినా.. మునుగోడు ఉపఎన్నిక గురించే మాట్లాడుకుంటున్నారు. మునుగోడు ఉపఎన్నికలో ఎవరు గెలుస్తారనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలు సర్వేలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ తో పాటు రాజగోపాల్ రెడ్డి చేరికతో బీజేపీ కూడా గట్టి పోటీ ఇవ్వనుంది. దీంతో మునుగోడులో త్రిముఖ పోటీ ఖాయంగా కనిపిస్తుంది. ఈ ముక్కోణపు పోటీలో విజయం ఏ పార్టీని వరిస్తుందనేది ఉత్కంఠకరంగా మారింది.

ఇక మునుగోడు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావడంతో.. ఈ ఉపఎన్నిక ఆ పార్టీకి సవాల్ గా మారింది. సిట్టింగ్ స్థానంలో ఓడిపోతే కాంగ్రెస్ కు ప్రజల్లో బలం లేదనే విషయం బయటపడినట్లు అవుతుంది. దీంతో తమకు కంచుకోట లాంటి మునుగోడులో గెలవాలని కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. మునుగోడు ఉపఎన్నికలో తమకు మద్దతు ఇవ్వాలని కమ్యూనిస్టు పార్టీలతో పాటు కోదండరాంను కూడా కోరుతోంది. ఇక టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీ… మునుగోడు ఉపఎన్నికలో గెలిచి టీఆర్ఎస్ కు షాకివ్వాలనే ఆలోచనలో ఉంది. ఇక్కడ గెలిచి వచ్చే ఎన్నికల్లో తమదే అధికారమని చెప్పుకోవాలని కాషాయదళం చూస్తోంది. దీంతో ఈ మూడు పార్టీలు మునుగోడు ఉపఎన్నికను సవాల్ గా తీసుకున్నాయి.

సిట్టింగ్ స్థానంలో కావడంతో రేవంత్ రెడ్డికి మునుగోడు ఉపఎన్నిక అగ్నిపరీక్షగా మారింది. రేవంత్ పీసీసీ చీఫ్ అయిన తర్వాత హుజూరాబాద్ ఉపఎన్నిక జరగ్గా.. అది టీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కావడంతో కాంగ్రెస్ అంతగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మునుగోడు కాంగ్రెస్ కు కంచుకోట లాంటిది కావడంతో ఇక్కడ తప్పక ఆ పార్టీ గెలవాల్సిన పరిస్థితి. దీంతో మునుగోడులో ఎలాగైనా గెలిచి ఒకేసారి టీఆర్ఎస్, బీజేపీకి షాకిచ్చి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తమ బలాన్ని చూపెడుతుందని, తక్కువ అంచనా వేయవద్దనే సంకేతాలను ప్రజల్లోకి పంపాలని రేవంత్ స్కెచ్ వేశారు. మునుగోడులో కాంగ్రెస్ ను గెలిపించి ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టే వ్యూహానికి తెరలేపారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -