Rishab Shetty-Allu Aravind: కన్నడ ఇండస్ట్రీ మీద అల్లు అరవింద్ కన్ను.. ఆ హీరోను పట్టేశాడుగా!

Rishab Shetty-Allu Aravind: సినిమాలో విషయం బాగా ఉంటే ఏ భాష అయినా జనాలు ఆదరిస్తారనే విషయం మరోసారి నిరూపితమైంది. తెలుగులో తీసిన బాహుబలి సినిమా ప్రపంచాన్ని అబ్బురపరిస్తే, కన్నడలో వచ్చిన కేజీఎఫ్ తెలుగుతో పాటు చాలామంది ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఇక అదే కోవలోకి ఇప్పుడు కాంతార చేరింది.

కాంతార సినిమా కన్నడలో చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందగా.. ఆ సినిమా జనాలకు విపరీతంగా నచ్చడంతో కన్నడ నుండి అనేక భాషల్లోకి డబ్ అయింది. తెలుగులో రిలీజ్ అయిన కాంతార సినిమా ఏకంగా కన్నడ రిలీజ్ డే వచ్చిన కలెక్షన్ల కన్నా ఎక్కువ కలెక్షన్లు రాబట్టడం విశేషం. ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

ఇక ఈ సినిమాతో తన యాక్టింగ్, డైరెక్షన్ సత్తాను చూపించిన రిషబ్ శెట్టికి తిరుగులేని గుర్తింపు లభిస్తోంది. ఆయన గతంలో చేసిన, తీసిన సినిమాలను సినీ జనాలు వెతికి మరీ చూస్తున్నారు. మొత్తానికి కాంతార సినిమా సక్సెస్ తో రిషబ్ శెట్టి ఓవర్ నైట్ స్టార్ గా కాగా.. రిషబ్ శెట్టిని అప్పుడే తెలుగు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ లైన్లో పెట్టేశాడు.

కాంతార సినిమాను తెలుగులో విడుదల చేసిన అల్లు అరవింద్.. రిషబ్ శెట్టితో తన బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్ లో ఓ సినిమాకు ఒప్పించేశాడట. ఈ మధ్యనే జరిగిన కాంతార సక్సెస్ మీట్ లో రిషబ్ శెట్టి, అల్లు అరవింద్ లు ఒకే వేదిక మీద కనిపించగా.. ఈ విషయాన్నని అల్లు అరవింద్ ప్రకటించాడు. త‌మ గీతా ఆర్ట్స్ బేన‌ర్లో సినిమా చేయాల‌ని రిష‌బ్‌ను అడిగాన‌ని, అత‌ను ఒప్పుకున్నాడ‌ని అల్లు అర్జున్ వేదిక మీద ప్ర‌క‌టించాడు. దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాగా వేసిన అల్లు అరవింద్.. ఇప్పుడు కన్నడ సినిమా మీద పాగా వేస్తాడని, కమర్షియల్ గా లాభం ఎక్కడ ఉంటే అక్కడికి అల్లు అరవింద్ వాలిపోతాడనే టాక్ ఉంది.

Related Articles

ట్రేండింగ్

Election Commission: పింఛన్ల పంపిణీలో ఈసీ కీలక ఆదేశాలు.. జగన్ సర్కార్ కు ఇక చుక్కలేగా!

Election Commission: ఏపీలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చింది అయితే ప్రజలకు అందే సంక్షేమ పథకాలు అన్నిటిని కూడా వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే తీసుకువెళ్లారు అయితే...
- Advertisement -
- Advertisement -