Election Commission: పింఛన్ల పంపిణీలో ఈసీ కీలక ఆదేశాలు.. జగన్ సర్కార్ కు ఇక చుక్కలేగా!

Election Commission: ఏపీలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చింది అయితే ప్రజలకు అందే సంక్షేమ పథకాలు అన్నిటిని కూడా వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే తీసుకువెళ్లారు అయితే ఎన్నికలకు కూడా అమలులోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని తెలియజేశారు. ఈ క్రమంలోనే గత నెల పింఛన్ పంపిణీ కార్యక్రమానికి కూడా వాలంటీర్లు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

ఇలా గత నెలలు వాలంటీర్లు పింఛన్ అంద చేయకపోవడంతో పింఛనిదారులందరూ కూడా తీవ్రస్థాయిలో ఇబ్బందులను ఎదుర్కొన్నారు కొన్నిచోట్ల మరణాలు కూడా సంభవించాయి అయితే ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి ఉండకూడదని చంద్రబాబు నాయుడు ముందుగానే ఈసీకి లేఖ రాశారు. అయితే పింఛన్ల పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈసీ పలు ఆదేశాలను జారీ చేసింది.

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ పించన్ లబ్ధిదారులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఈసిఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పింఛన్ పంపిణీతో పాటు ప్రభుత్వ అధికారులతో పంపిణీ చేయాలని ఆదేశాలను జారీ చేసింది. ఇప్పటివరకు వాలంటీర్లు ఇంటింటికి పింఛన్ అందజేశారు అయితే వారి స్థానంలో ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పింఛన్ అందజేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేశారు.

గత నెల పింఛన్ అందజేసే విషయంలో ప్రభుత్వ తీరుపై ఇప్పటికే ఎన్నో ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. లబ్ధిదారులందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారని వెల్లడించారు అయితే ఈసారి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -