Rohit: రోహిత్ వస్తున్నాడు.. తుది జట్టులో ఎవరిని తప్పిస్తారు?

Rohit: ఓపెనింగ్ జోడి ని మార్చాల్సిన అవసరం ఉందా? వరల్డ్ కప్ తరువాత బాగా వినిపించిన మాట ఇండియాలో. ఓపెనర్లు రాణించకపోవడం దీనికి పెద్ద కారణం. అయితే ఎవరిని ఓపెనింగ్ స్థానంలో పంపాలి అనేది పెద్ద ప్రశ్న. వన్డే విషయంలో మనకి ఒక ఆప్షన్ లభించింది ఇషాన్ కిషన్ రూపంలో. ఈ పాకెట్ డైనమేట్ ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. దీంతో ఈ కుర్ర ఆటగాడిని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది.

 

రోహిత్ శర్మ వల్ల స్థానం కోల్పోయేది ఎవరు?

ఇప్పుడు టెస్ట్ లోనూ అదే పరిస్థితి నెలకొంది. యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ రెండో ఇన్నింగ్స్ లో సెంచరీతో కదం తొక్కాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఎన్నో విమర్శలు ఎదురుకున్న గిల్ రెండో ఇన్నింగ్స్ లో సెంచరీతో దానికి సమాధానం చెప్పాడు. టెస్ట్ ఫార్మాట్ లో గిల్ కి ఇది మొదటి సెంచరీ. 3 సిక్సులు, 10 ఫోర్లతో 110 పరుగులు బాదాడు. దీంతో అతను మంచి టచ్ లోకి వచ్చాడు.

 

ఇప్పుడు ఇదే సమస్య. గాయం వల్ల వన్డే సీరీస్ ఆడలేకపోయిన రోహిత్ శర్మ ఇప్పుడు కోలుకున్నాడట. రెండో టెస్ట్ నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఎవరో ఒకరు తన స్థానాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది. రోహిత్ శర్మ ఓపెనర్ కాబట్టి రెండవ ఓపెనర్ గురించే ప్రశ్న అంతా.

 

ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎవరిని తప్పించాలో తెలియని పరిస్థితి. కెఎల్ రాహుల్‌ పెద్దగా చెప్పుకోతగిన ప్రదర్శన అయితే చేయలేదు. అయితే అతను వైస్ కెప్టెన్ కాబట్టి అతన్ని తీసేయ్యలేరు. మిస్టర్ డిపెండబుల్ ఛతేశ్వర్ పూజారా కూడా ఫామ్‌ లోకి వచ్చాడు. దాదాపు మూడున్నర సంవత్సరాల తరువాత సెంచరీ బాదాడు. అది కూడా ఫాస్టెస్ట్ సెంచరీ. టెస్ట్ ఫార్మాట్ స్పెషలిస్ట్ పుజారాని తీసేసే ధైర్యం మాత్రం టీమిండియా చేయలేకపోవచ్చు. అటు తిరిగి ఇటు తిరిగి శుబ్‌మన్ గిల్ పైనే వేటు పడవచ్చు అంటున్నారు నిపుణులు. చూడాలి మరి ఎవరు ఫైనల్ జట్టులో స్థానం సంపాదించుకుంటారో.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు పోటీ అదే పేర్లతో ఉన్న ఇద్దరు పోటీ.. వైసీపీ కుట్ర చేస్తోందా?

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల త్వరలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల హడావిడి నెలకొంది. ఈ క్రమంలోనే ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఒక్కో...
- Advertisement -
- Advertisement -