Manchu Lakshmi: ఆ విషయంలో రోహిత్ కు నేను అభిమానిని.. మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్ వైరల్!

Manchu Lakshmi: మోహన్ బాబు వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి మంచు లక్ష్మీ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ నటిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఎన్నో సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి మంచు లక్ష్మి త్వరలోనే అగ్ని నక్షత్రం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.

 

ఈ సినిమా మంచు లక్ష్మికి ఎంతో ప్రత్యేకమైనదని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాకు ఈమె తన తండ్రితో కలిసి నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాకుండా మొదటిసారి తన తండ్రి మోహన్ బాబుతో కలిసి ఈమె స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. ఇలా తన తండ్రితో కలిసి మంచు లక్ష్మి నిర్మిస్తూ నటిస్తున్నటువంటి మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమా తనకు ఎప్పుడు ప్రత్యేకమేనని మంచు లక్ష్మి పలు సందర్భాలలో ఈ సినిమా గురించి తెలియజేశారు.

ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నటువంటి ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా విడుదలైనటువంటి ప్రమోషన్ సాంగ్ ప్రస్తుతం ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఈ క్రమంలోనే మంచు లక్ష్మి మీడియా సమావేశంలో మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.పోలీస్ కథ నేపథ్యంలో కొనసాగే సినిమాలను బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తారని ఈమె తెలిపారు. ఆయన పనికి నేను పెద్ద అభిమానిని తెలిపారు.

 

అగ్ని నక్షత్రం సినిమాలో తాను ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించానని ఈమె తెలిపారు.పోలీస్ పాత్రకు న్యాయం చేయడం కోసం తాను ఎంతో కష్టపడ్డానని ఈ సందర్భంగా మంచు లక్ష్మి తెలిపారు. రోహిత్ ఫిలిం స్టైల్ మేకింగ్ ఇష్టపడుతూ తెలుసా అనే ప్రమోషనల్ సాంగ్ తయారు చేశామని ఈ పాట కోసం 80 కోట్ల రూపాయలు విలువ చేసే ఖరీదైన కారులను ఉపయోగించామని తెలిపారు. ఇక ఈ పాట మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనం అంటూ ఈమె తెలియజేశారు. అయితే అగ్ని నక్షత్రం సినిమాకి వంశీకృష్ణ దర్శకుడుగా పనిచేస్తున్న విషయం మనకు తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -