Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో రోజాకు ఘోర అవమానం.. ఏమైందంటే?

Telangana Assembly: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పాలన చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇలా ఉంటుదని తప్పుడు ప్రచారం చేసిన వాళ్లకి.. రేవంత్ సీఎం అయితే మరింత దారుణంగా ఉంటుందన్న వారికి ఆయన తన పనితోనే సమాధనం చెబుతున్నారు. వ్యక్తిగత ఆర్భాటాలను తగ్గిస్తూ వీలైంత తక్కువ ఖర్చులతో పాలన చేస్తున్నారు. అంతేకాదు.. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. కేసీఆర్ సర్కాల్‌లోని విద్యుత్ ఒప్పందాల్లోని అక్రమాలు, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలోని అవినీతిని ప్రజల ముందు బయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో, పాటు దరణి ద్వారా పెద్ద ఎత్తున భూములు చేతుమారాయని ఆరోపిస్తూ అందులోని లోపాలను బయటపెడుతున్నారు.

 

రేవంత్ రెడ్డి పాలనలో తనదైన మార్క్ చూపిస్తూనే కేసీఆర్ కి ఉన్న క్రెడిబిలిటీని దెబ్బ తీయాలని చూస్తున్నట్టు అర్థం అవుతోంది. ప్రత్యేక తెలంగాణ వస్తే జరగవని జరిగిన ప్రచారాలను కేసీఆర్ తిప్పికొట్టారు. రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ చీకటిమయం అయిపోతుందని ప్రచారం జరిగింది. అటు, ప్రత్యేక తెలంగాణలో వ్యవసాయానికే కాదు.. తాగడానికి కూడా నీళ్లు ఉందడవనే ప్రచారం కూడా విభజనకు ముందు ఉండేది. కానీ, ఆ ప్రచారం అబద్ధం అని కేసీఆర్ నిరూపించారు. 24 గంటల పవర్ ఇస్తూ.. కరెంట్ కోతలు లేని తెలంగాణను దేశం ముందు నిలబెట్టారు. అటు, కాలేశ్వరం ద్వారా నీటి సంక్షోభానికి కూడా చెక్ పెట్టారు. పవర్, వాటర్ సమస్యలు పరిష్కరించడంతో కేసీఆర్ తెలంగాణ బ్రాండ్ గా మారారు.

 

అయితే, ఇక్కడో విషయం చెప్పుకోవాలి. తెలంగాణ ప్రత్యేకరాష్ట్రంగా అవతరించడమే కాదు.. ధనిక రాష్ట్రంగా కూడా అవతరించింది. హైద్రాబాద్ మీద వచ్చే ఆదాయం గతంలో రెండు తెలుగు రాష్ట్రాల సంక్షేమానికి ఖర్చు చేశారు. కానీ, ఇప్పుడు ఒక్క తెలంగాణకు మాత్రమే ఖర్చు చేస్తున్నారు కనుక, కాళేశ్వరం నిర్మాణం పూర్తి అయింది. విద్యుత్ సంక్షోభానికి కూడా చెక్ పడింది. దీని వలన ఎన్ని అప్పులు చేశారా? ప్రభుత్వం ఎంత సంక్షోభంలోకి వెళ్లిపోయిందా? అనేది ప్రజలకు తెలియదు కానీ.. వారి సమస్యలకు పరిష్కారం కేసీఆర్ ద్వారా లభించిందని ప్రజలు భావిస్తున్నారు.

 

కేసీఆర్‌కు వచ్చిన బ్రాండ్ నేమ్ వెనక పెద్దకుట్ర ఉందని రేవంత్ రెడ్డి ఆరోపణ. లక్ష కోట్లకు పైగా ఖర్చుచేసి కట్టి కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని.. నాణ్యత లోపించిందని కాంగ్రెస్ సర్కార్ ఆరోపిస్తోంది. రేవంత్ ఆరోపణలకు తగ్గట్టగానే పరిస్తితులు కూడా ఉన్నాయి. మేడిగడ్డ కుంగడంతో పాటు.. కేంద్రం కమిటీ రిపోర్టుకూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. దీంతో..కేసీఆర్ ప్రజల కోసం కాకుండా.. ఆయన కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టాడని రేవంత్ ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇక విద్యుత్ ఒప్పందాల విషయంలో కూడా ఇలాగే జరిగిందని ఆరోపిస్తున్నారు. ఉచిత విద్యుత్ పథకం పేరుతో.. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం దగ్గర ఎక్కువ ధరకు విద్యుత్ కొన్నారని విమర్శిస్తున్నారు. దీనిపై శ్వేతపత్రం కూడా విడుదల చేశారు.

 

ఇక.. కేసీఆర్, జగన్ ఇద్దరూ తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసమే ఆలోచించారని రేవంత్ రెడ్డి విమర్శించారు. కృష్ణాజలాలను కేంద్రానికి రాసిచ్చేశామని తమపై కేసీఆర్ ఆరోపణలు చేయడం సరికాదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కృష్ణాజలాలను ఏపీకి రాసిచ్చింది కేసీఆర్ అని మండిపడ్డారు. ప్రగతి భవన్‌లో జగన్‌కు కేసీఆర్ పంచభక్ష్య పరమాన్నాలు పెట్టి జీవో 203 రాసిచ్చారని ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ప్రగతి భవన్‌లో డైనింగ్ టేబుల్‌పైనే బీజం పడిందని సెటైర్లు వేశారు. కేసీఆర్‌ రాయలసీమకు వెళ్లి.. మంత్రి రోజా పెట్టిన రాగిసంగటి, రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాలసీమను చేస్తానని మాటిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి ఆ అలసు ఇవ్వడం వలనే మొన్న జరిగిన ఎన్నికల రోజు ఏపీ పోలీసులు నాగార్జున సాగర్ ను ఆక్రమించకున్నారని మండిపడ్డారు. ఆ రోజ అంత జరిగినా.. బీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తూ ఉండటం తప్పా.. చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు.
తెలంగాణ కోసం అది చేశా.. ఇది చేశా అని చెప్పుకోవడం తప్ప కేసీఆర్ ఏం చేయలేదని విమర్శించారు. ఏం చేసినా తన కోసం తన వాళ్ల కోసమే చేసుకున్నారని ఆరోపించారు. ఇందులోని భాగంగానే ఏపీ మంత్రి రోజాను కూడా కలిపి విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. రోజా రోయ్యిల పులుసు డైలాగ్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతోంది. రోజాను ఇంత మాట అనేశావేంటీ బ్రో అంటూ నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -