BRS Party: తెలంగాణలో కరువు పరిస్థితులు.. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనే ఈ పరిస్థితికి కారణమా?

BRS Party: తెలంగాణలో కరువు మొదలైంది. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ ట్విస్ట్ ఏంటీ అంటే.. అధికారపార్టీ కూడా దాన్ని వ్యతిరేకించడంలేదు. తెలంగాణలో కరువు ఉందని అంగీకరిస్తుంది. అయితే, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్వాకం వలనే ఇప్పుడు తెలంగాణలో కరువు తాండవిస్తుందని మండిపడుతున్నాయి. దీంతో.. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. కవిత అరెస్ట్ అయితే దానిపై స్పందించలేదు. గత ప్రభుత్వంపై పలు ఆరోపణలు వస్తే వాటి స్పందించడం లేదు. కానీ, పార్లమెంట్ ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి పొలం బాట పేరుతో పంటలను పరిశీలించడానికి సిద్దం అయ్యారు. జనగామ, సూర్యాపేట జిల్లాల్లో ఎండిన పంటలను పరిశీలించిన తర్వాత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అసమర్థత వలనే పంటలు ఎండిపోయాయని.. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 15 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని ఆరోపించారు. ఎకరాకు 25 వేల రూపాయల చెప్పున రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణలో కరువు వచ్చింది కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. కొత్త సర్కార్ వచ్చిన వంద రోజుల్లోనే 200 మంది రైతులు చనిపోయారని ఆరోపించారు. అంతేకాదు.. ఆయన తన ప్రెస్ మీట్‌లో నేను చెప్పింది వినండి… ప్రశ్నలు అడగొద్దని మీడియాకు వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో.. ఆయన చెప్పాలనుకున్నదే చెప్పారు. కవిత ప్రస్తావన, బీఆర్ఎస్ పై వస్తున్న అవినీతి ఆరోపణలపై ప్రశ్నలు వేయకుండా అడ్డుకున్నారు. మీడియా వాళ్లు ప్రశ్నలు వేయకపోతే.. కాంగ్రెస్ నేతలు ఆగుతారా? ఆయనకు ధీటుగా సమాధానం చెబుతూ ప్రశ్నల వర్షం కురింపిచారు. కేసీఆర్ కు రైతులు ఇప్పుడు గుర్తొచ్చారా? అని మండిపడింది. ఎన్నికల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ఎందుకు హాజరుకాలేదని కాంగ్రెస్ నేతలు నిలదీశారు. ప్రజల తరఫున ఎందుకు అసెంబ్లీలో ప్రశ్నించలేదన్నారు. ఎంపీ ఎన్నికలకు ముందు కేసీఆర్ చిలకపలుకులు పలుకుతున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ వచ్చింది.. కరువు వచ్చింది అన్న బీఆర్‌ఎస్ నేతల మాటలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. 84 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్‌కు ఎప్పుడు వర్షకాలం, ఎప్పుడు ఎండాకాలమో తెలియదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2023, డిసెంబర్‌లో కొలువుదీరిందన్నారు. అప్పుడు చలికాలం.. ప్రస్తుతం వేసవి కాలం అని వివరించారు. ఇక ఇరిగేషన్ మినిష్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కేసీఆర్ పై మండిపడ్డారు. వర్షాభావ పరిస్థితుల్లో నాగార్జున సాగర నీటిని తాగునీటికే వాడాలని గతంలోనే కేసీఆర్ రూల్ తెచ్చారన్న విషయాన్ని మంత్రి ఉత్తమ్ గుర్తు చేస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యమే ప్రస్తుత పరిస్థితులకు కారణమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులకు మేడిగడ్డ కుంగిపోవడం కూడా ఓ కారణంగా చెప్పొచ్చు. అంతేకాదు.. గత ప్రభుత్వం విద్యుత్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలు తెలంగాణ రాష్ట్రాన్ని అదోగతి పాలు చేసింది. విద్యుత్ కంపెనీలకు ప్రభుత్వం 80 వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. అది కూడా ప్రస్తుతం కరెంట్ సంక్షోభానికి కారణంగా చెప్పొచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -