Roja: నగరి నియోజకవర్గంలో ఒంటరి పక్షిలా మారిన రోజా.. శత్రువులే తప్ప మిత్రులు లేరా?

Roja:  నగరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి రోజా ప్రస్తుతం నగరి నియోజకవర్గంలో ఒంటరి పక్షిగా మారిపోయారు. ఈమె 2014 ఎన్నికలలో వైసిపి నుంచి గెలుపొందారు. అలాగే 2019 సంవత్సరంలో కూడా 2 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇలా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రోజా మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు .పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి ఈమె రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టడమే కాకుండా నగరి నియోజకవర్గ అభివృద్ధిని కూడా పక్కన పెట్టారు.

పర్యాటక శాఖ మంత్రి అంటే బహుశా నెలలు నాలుగు సార్లు వెంకటేశ్వర స్వామిని అలాగే తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి సందర్శించడం అనుకున్నారేమో కానీ ఇంతకుమించి ఈమె పర్యాటక మంత్రిగా ఎలాంటి బాధ్యతలను నిర్వర్తించలేదని చెప్పాలి. ఇక రోజా ఎమ్మెల్యేగా మంత్రిగా ఉంటూ ప్రతిపక్ష నేతలపై తీవ్ర స్థాయిలో అసభ్యకర పదాలతో దూషించేవారు. జగన్ మోహన్ రెడ్డి పై ప్రశంసలు కురిపిస్తూనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ పై అసభ్య పదజాలం ఉపయోగించి వారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు.

ప్రతిపక్ష నేతలపై రోజా నోటి దురుసు కారణంగా టిడిపి నగరిని టార్గెట్ చేస్తూ ఎలాగైనా ఇక్కడ తమ పార్టీ జెండా ఎగరవేయాలని భావించారు. ఈ క్రమంలోనే భాను ప్రకాష్ ని రంగంలోకి దించారు. ఇక ఈయనకు టిడిపి జనసేన బిజెపి మద్దతు పూర్తిగా ఉండడమే కాకుండా నగరిలో రోజాకు వ్యతిరేకంగా ఉన్న వారందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు.

నగరిలో రోజాను గెలిపించే బాధ్యత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్ మోహన్ రెడ్డి అప్పగించారు. అయితే రోజా మంత్రి పెద్దిరెడ్డి మద్యం శత్రుత్వం ఉన్న నేపథ్యంలో ఆయన రోజాను వ్యతిరేకించే వారికి మద్దతు తెలుపుతూ ఆమె ఓటమికి పరోక్షంగా సహాయం చేస్తున్నారు. ఇలా రోజాకు ఎవరు మద్దతుగా నిలవకపోవడంతో ఈమె నగరి నియోజకవర్గంలో ఒంటరి పక్షగా మిగిలిపోయింది. ఇక ఈసారి రోజా గెలుపు కూడా గగనమే అని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -