Saakini Daakini: యాక్షన్ థ్రిల్లర్ గా శాకిని డాకిని టీజర్!

దక్షిణ కొరియా చిత్రం మిడ్ నైట్ రన్నర్ కి రీమేక్ చిత్రంగా తెలుగులో డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా కసాండ్రా, నివేద థామస్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం శాకిని – డాకిని. డి. సురేశ్‌ బాబు, సునీత తాటి, హ్యూన్వూ థామస్‌ కిమ్‌ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 16వ తేదీ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ టీజర్ లో భాగంగా నివేదా థామస్ రెజినా ఇద్దరు పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో ఉన్నట్టు చూపించారు. ఇందులో రేజీనా ఓసీడీ సమస్యతో బాధపడుతూ ఉండగా నివేద థామస్ మాత్రం ఫుడ్ లవర్ గా కనిపిస్తారు.

పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో భాగంగా వీరిద్దరూ తక్కువ పనితీరు కనబరచడమే కాకుండా అనవసరమైన విషయాలలో గొడవలు పడుతూ పెద్ద ఎత్తున వివాదాలను సృష్టిస్తున్నట్లు చూపించారు.ఇక ఈ సినిమాలో ప్రధాన కథాంశంగా ఒక నేరస్థుడు ఒక అమ్మాయి తలపై కొట్టి పారిపోవడం అయితే ఆ వ్యక్తి ఎవరనే విషయం గురించి కథ నడుస్తుందని తెలుస్తుంది. మొత్తానికి ఈ టీజర్ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తుంది.

ఈ టీజర్ చూస్తుంటే మాత్రం ఈ సినిమాలో వినోదంతో పాటు యాక్షన్, బలమైన కథ, డ్రామా ఉన్నట్లు తెలుస్తోంది. థ్రిల్లర్‌ సినిమాలను అద్భుతంగా హ్యాండిల్ చేయడంలో డైరెక్టర్ సుధీర్ వర్మ ఎంతో నైపుణ్యం కలవాలని మరోసారి ఈ టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఇందులో సుధీర్ వర్మ తన మార్క్ ఏంటో చూపించారు. మొత్తానికి శాకిని – డాకినిగా రెజీనా నివేద థామస్ సందడి చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -