Shaakini Daakini Movie Review: షాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్

విడుదల తేది : సెప్టెంబర్ 16
నటీనటులు: రెజీనా కసాండ్రా, నివేదా థామస్, సుధాకర్ రెడ్డి, రఘుబాబు, పృథ్వి
నిర్మాణ సంస్థ : సురేష్ ప్రొడక్షన్స్ గురు ఫిలిమ్స్ క్రాస్ పిక్చర్స్
నిర్మాత : సునీత తాటి, దగ్గుబాటి సురేష్ బాబు
దర్శకత్వం : సుధీర్ వర్మ
సంగీతం : మిక్కీ ఎం క్లిరి
సినిమాటోగ్రఫీ : రిచర్డ్ ప్రసాద్
ఎడిటర్ : విప్లవ్ నైషడం

Shaakini Daakini Movie Review and Rating

కథ: దామిని(రెజీనా) మరియు షాలిని( నివేదా థామస్‌) లు పోలీస్ ట్రైనింగ్ కోసం అకాడమీలో జాయిన్ అవుతారు. మొదట్లో ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు ఉంటాయి. ఇద్దరు అహంకారంతో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. ఇద్దరికి ప్రతి విషయంలో కూడా విభేదాలు ఉంటాయి. అలాంటి వారిద్దరు ఒక అర్థరాత్రి సమయంలో ఒక అమ్మాయి నీ కిడ్నాప్‌ చేయడం చూస్తారు.

వెంటనే పోలీసులకు తెలియజేసినా కూడా అప్పటికే మరో పెద్ద వాళ్ల కేసుతో బిజీగా ఉండటం వల్ల అమ్మాయికి సంబంధించిన కిడ్నాప్ గురించి పట్టించుకోరు ఆ పోలీసులు. దాంతో ట్రైనీ పోలీసులు అయిన దామిని, షాలిని ఆ కేసులో అనధికారికంగా ఎంక్వౌరీ చెయ్యడం స్టార్ట్ చేస్తారు. ఆ సమయంలో ఆ కిడ్నాప్ వెనుక పెద్ద క్రైమ్‌ జరుగుతుందని తెలుసుకుంటారు. ఆ క్రైమ్‌ ను ఇద్దరు ఎలా బయటకు తీసుకు వస్తారు? ఆ తర్వాత ఏం జరుగుతుంది? అనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు : రెజీనా, నివేదా థామస్ ఇద్దరు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇద్దరికి ఇద్దరు కూడా పోటా పోటీ నటించి మెప్పించారు. ప్రేక్షకులకు ఎంటర్‌ టైన్మెంట్ ను అందించేందుకు ఇద్దరు కూడా కాస్త ఎక్కువగానే కష్టపదినట్టు అనిపిస్తుంది. ఇక సినిమాలో మిగిలిన పాత్రల్లో నటించిన సుధాకర్ రెడ్డి, రఘు బాబు, పృథ్వీ చాలా నవ్వించారు. ప్రతి ఒక్కరు తమ పాత్రలకు న్యాయం చేశారు అనే చెప్పాలి.

విశ్లేషణ: ఆడవారిని బాగా ఆకట్టుకునే సినిమా ఇది. ఒక సున్నితమైన ఆడవారికి సంబంధించిన విషయమే అయినా కూడా కొన్ని ఎంటర్ టైన్మెంట్‌ సన్నివేశాలతో చూపించే ప్రయత్నం చేశారు. కొన్ని సన్నివేశాల విషయంలో లాజిక్ మిస్‌ అయినట్టుగా అనిపించింది. అలాగే ఎమోషనల్‌ సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేదు. సెకండ్‌ హాఫ్ ఇంకాస్త బెటర్ గా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది.

ప్లస్ పాయింట్స్ : నటీనటులు, కామెడీ సన్నివేశాలు, డైలాగులు

మైనస్ పాయింట్స్ : ఎమోషనల్ సీన్, సెకండ్ హాఫ్, లాజిక్ లేని స్క్రీన్ ప్లే

రేటింగ్ : 2.5/5

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -