Actress Regina Cassandra: తనను అలా ప్రశ్నించాడని జర్నలిస్టుపై మండిపడ్డ హీరోయిన్?

Actress Regina Cassandra: ప్రముఖ నటి రెజీనా కసాండ్రా గురించి తెలియని వారు ఉండరు. తెలుగు, కన్నడ భాషలో నటించి మంచి గుర్తింపుని తెచ్చుకుంది. తెలుగులో మొదటిగా శివ మనసులో శృతి అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది. ఈ సినిమా తర్వాత నుంచి వరుసగా సినిమాలు చేసింది.

పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, పవర్ లాంటి చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. అయితే రెజీనా హవా తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువ రోజులు నడవలేదు. సడన్ గా రెచ్చినా కెరీర్ పడిపోతూ వచ్చింది. తాజాగా రెజీనా శాకిని డాకిని అనే సినిమాలో నటించింది.

ఈ సినిమాకు సంబంధించి ప్రెస్ మీట్ హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ సినిమాలో రెజీనా ఓసిడితో ఇబ్బంది పడే పాత్రను పోషించింది. అయితే ఈ సినిమా ప్రెస్ మీట్ సందర్భంగా మీడియా వాళ్ళు ఆమెకు కొన్ని ప్రశ్నలు వేయగా.. ఆ ప్రశ్నలకు చాలా ఇబ్బంది పడింది చాలా అసహనానికి గురైంది.

ఒక మీడియా సోదరుడు మీకు కూడా ఓసిడి ఉందా అంటూ క్యాజువల్ గా ఒక ప్రశ్న వేశాడు. దాంతో రెజీనా మీ దగ్గర ఇంతకుమించి ప్రశ్నలేం లేవా? అని రిపోర్టర్ మొహం మీద అడిగేసింది. ఓసిడి అనేది ఒక వ్యాధి ఈ ప్రశ్నకు హీరోని కూడా అడగగలరా..? అని అన్నది. కానీ ఇలాంటి ప్రశ్నలకు వేరే సెలబ్రెటీలు చాలా సింపుల్ గా సమాధానం చెప్పేస్తుంటారు.

కానీ రెజీనా మాత్రం కాస్త ఓవరాక్షన్ చేసినట్టు కనిపించింది. ఈ ప్రశ్నకే కాదు ప్రతిదానికి ఇబ్బంది పడుతూ కనిపించింది. సెల్ ఫోన్ రింగ్ అయినప్పుడు కూడా ఇలానే ఓవరాక్షన్ చేసినట్టు కనిపించింది. మీరు ప్రెస్ మీట్లకు వచ్చినప్పుడు సెల్ ఫోన్లు ఆఫ్ చేసుకోరా.. అంటూ మొహాల మీదే అడిగేసింది.

అయితే మీడియా కూడా పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. కానీ మీడియా అడిగిన ప్రశ్నలకు ఇలాంటి సమాధానాలు ఇవ్వడం రెజీనా అలా స్పందించడం కాస్త చర్చనీయాంశం అవుతుంది. అయినా సెలెబ్రెటీలు ఎప్పుడూ చెప్పిన టైం కు రారు. ఈ ప్రెస్ మీట్ కూడా దాదాపు రెండు గంటలు ఆలస్యంగా మొదలైందని తెలిసింది. ఇదే ప్రశ్నని అడిగితే ఆమె దగ్గర ఏం సమాధానం ఉంటుందో అని అనుకుంటున్నారు జనాలు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -