Samantha-Tamannaah: సామ్, తమన్నా సమాధానం చెప్పాల్సిందే.. ఓటీటీ అంటే ఇదే అంటూ?

Samantha-Tamannaah: ఇప్పడంతా సినీ రంగంలో ఓటీటీ హవా నడుస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్ కాదు.. ఏ హలీవుడ్ లోనూ ఇదే నడుస్తోంది. హాలీవుడ్ తో మనం పోల్చేకోలేం కానీ, మన సినిమాలు, నటన, డ్రస్సింగ్ పద్ధతి వేరేలా ఉంటుంది. అందుకే సినిమాల్లో చాలా కట్టింగ్ లు ఉంటాయి. అయితే ఓటీటీకి సెన్సార్ లేకపోవటంతో, సీన్లకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. దీనిపై మన తారాగణం ఏమంటుంది మరీ..?

ఓటీటీ ప్లాట్ మీదుగా ఈ మధ్యకాలంలో వచ్చిన వెబ్ సిరీస్ లను మన సినిమాలతో పోల్చితే ఎక్కడా పొంతన ఉండదు. వీటిలో వల్గారిటీ సృతి మించి ఉంటోంది. ఏ స్థాయిలో అంటే.. కుటుంబంతో అస్సలు కలిసి చూడలేం. ఇది మనం చెప్పడమేంటి.. ఈ సిరీస్ లను చేసినవారే స్వయంగా చెబుతున్నారు.

వెంకటేశ్ ఈ మధ్యకాలంలో ఓ సిరీస్ చేశాడు. దీని పేరు రానానాయుడు. రానాతో కలిసి ఈ వెబ్ సిరీస్ చేశాడు. ఇందులో టూ మచ్ వల్గారిటీ ఉంది. వెంకటేష్ ఏమైనా నిన్న మెున్న వచ్చిన హీరోనా కాదు. ఆయకు అభిమానుల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇలాంటి హీరోతో బూతులు చెప్పించొచ్చా అనేదే ప్రశ్న.

మరోవైపు హీరోయిన్లు కూడా ఈ దారినే ఎంచుకంటున్నారు. తాజాగా తమన్న ట్రెండ్ అవుతోంది. ఇన్నాళ్లూ ఆమెను పవిత్రంగా అభిమాలు భావించేవారు. లిప్ లాక్ సీన్ కు కూడా ఒప్పుకునేది కాదు బ్యూటీ. ఓటీటీకి వచ్చేసరికి రెచ్చిపోయింది. వెండితెరపై తన సినిమాలు చూసే ఆడియన్స్, ఓటీటీలో శృంగార దృశ్యాలు చూడరనే భ్రమలో ఉందేమో మరి.

వాస్తవానికి బాగుంటే ఓటీటీ ప్లాట్ ఫాంలోని సిరీస్ లను సినిమాల్లోనే చూస్తున్నారు. కేవలం బూతులు ఉన్న వాటినే జనాలు చూడటం లేదు. కంటెంట్ ఉంటే అన్నిటిని ఆదరిస్తున్నారు. కానీ ఓటీటీ అంటే బూతుకు అడ్డా అన్న చెందంగా మార్చేశారు. నిజానికి స్వేచ్ఛ అంటే ఇది కాదు. శృంగారం, హింస లేకపోతే ఓటీటీ కంటెంట్ క్లిక్ అవ్వదనే భ్రమ నుంచి బయటకు రావాలి.

Related Articles

ట్రేండింగ్

YSR Cheyutha Scheme: డబ్బులన్నావ్.. డబ్బాలు కొట్టుకున్నావ్.. చేయూత నాలుగో విడత జమయ్యాయా జగన్?

YSR Cheyutha Scheme: జగన్మోహన్ రెడ్డి ఇటీవల తన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన సంగతి తెలిసిందే .ఈ మేనిఫెస్టోలో భాగంగా ఈయన గత ఐదు సంవత్సరాల కాలంలో ఏ సామాజిక వర్గానికి...
- Advertisement -
- Advertisement -