Movies: జూన్ ఆఖరి వారంలో అలరించే చిత్రాలు ఏవంటే?

Movies: ఇప్పుడిప్పుడే ఎండలు తగ్గి వర్షాలు మొదలవుతున్నాయి. ఆది పురుష్ హవా కూడా తగ్గింది. ఇక ఈ వారంలో వచ్చే సినిమాలు మీదే అందరి దృష్టి. ఈవారం థియేటర్ లో, ఓటిటిలో ఏం సినిమాలు రిలీజ్ అవుతున్నాయా ఒక లుక్కేద్దాం రండి.

ముందుగా జూన్ 29న శ్రీ విష్ణు హీరోగా రామ్ అబ్బరాజు తెరకెక్కించిన చిత్రం సామజ వర గమన. ఇది పూర్తిగా వినోదాత్మక చిత్రం. ప్రభ మౌనిక జాన్ కథానాయకగా నటిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ దండా నిర్మాత అనిల్ సుంకర సమర్పణలో వస్తున్నా ఈ సినిమా ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

ఈ సినిమాకి సంగీతం గోపి సుందర్, చాయాగ్రహణం రామ్ రెడ్డి. అదే రోజు థియేటర్లలోకి వస్తున్న మరొక సినిమా స్పై. నిఖిల్ హీరోగా తరికెక్కుతున్న ఫ్యాన్ ఇండియా మూవీ ఎడిటర్ గ్యారీ బిహెచ్ ఈ సినిమాతో దర్శకుడుగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. ఐశ్వర్య మీనన్ కథానాయకగా నటించిన ఈ చిత్రానికి కె. రాజశేఖర్ రెడ్డి కథ సమకూర్చడంతో పాటు ఈడి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై స్వయంగా నిర్మిస్తున్నారు.

 

సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక దాగివున్న రహస్యాల కథ ఆధారంగా రూపొందిన చిత్రం ఈ స్పై. ఇక జూన్ 30న సునీల్, శ్రీనివాసరెడ్డి, పాయల్ రాజ్ పుత్ ప్రధాని పాత్రలతో వస్తున్న సినిమా మాయాపేటిక. రమేష్ రాపర్తి దర్శకుడు. ఇదే జూన్ 30న వస్తున్న మరొక సినిమా లవ్ యు రామ్. రోహిత్ బెహల్, అపర్ణ జనార్ధన్ జంటగా నటించిన చిత్రం ఇది. రెండు భిన్న మనస్తత్వాలు ఉన్న వ్యక్తుల ప్రేమ కథ ఈ సినిమా.

 

ఇంకా అమెజాన్ ప్రైమ్ లో జాక్ ర్యాన్ వెబ్ సిరీస్. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ది వీకెండ్ ఫ్యామిలీ వెబ్ సిరీస్, జూన్ 28న ది నైట్ మేనేజర్ సిరీస్, జూన్ 30న రిలీజ్ అవుతుంది. బుక్ మై షో లో ఫాస్ట్ ఎక్స్ హాలీవుడ్ మూవీ జూన్ 29న, జియో సినిమాలో సార్జెంట్ హిందీ సీరియల్స్ జూన్ 30న, అర్థమైందా అరుణ్ కుమార్ తెలుగు సీరిస్, జూన్ 30న ఆహా లో రిలీజ్ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Jagan- Pawan, Sharmila: ఆ జిల్లాలో ఒకేరోజు జగన్, షర్మిల, పవన్ కళ్యాణ్.. ప్రచారంతో మెప్పించేదెవరో?

Jagan- Pawan, Sharmila: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నాయకులు జనాలలోనే ఉంటూ పార్టీ ప్రచార కార్యక్రమాలను...
- Advertisement -
- Advertisement -