OTT BRO: ఓటీటీలో బ్రో మూవీ స్ట్రీమింగ్ అయ్యే రోజు ఇదేనా?

OTT BRO: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుప్రీం హీరో సాయి ధరంతేజ్ మల్టీస్టారర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బ్రో. తమిళ వినోదయ సీతం సినిమాకు రీమేక్ చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తెలుగు వర్షన్ కి అనుగుణంగా పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కి అనుగుణంగా ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందించారు.ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా కొన్ని చోట్ల పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోగా మరికొన్నిచోట్ల మిశ్రమ స్పందన అందుకుంటుంది. ఇక కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా అనుకున్న స్థాయిలో కలెక్షన్లను రాబట్ట లేకపోయిందని చెప్పాలి.ప్రస్తుతం థియేటర్లలో ప్రసారం అవుతున్నటువంటి ఈ సినిమా ఓటీటీ పార్టనర్ కూడా ఫిక్స్ అయ్యారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సమస్త నెట్ ఫ్లిక్స్ భారీ ధరలకు కొనుగోలు చేశారు.

 

ఇలా ఈ సినిమా డిజిటల్ రైట్స్ ఫాన్సీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం థియేటర్లలో ఈ సినిమాలన్నీ ప్రసారం అవుతూ ఉండగా త్వరలోనే డిజిటల్ మీడియాలో కూడా ప్రసారం కాబోతోంది అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా థియేటర్లో విడుదలైన ఐదు వారాలకు ఓటీటీలో విడుదల కాబోతుందని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ రెండవ తేదీ నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతుందని సమాచారం.

 

ఇప్పటివరకు ఈ సినిమా డిజిటల్ రిలీజ్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు అంటూ ఓ వార్త వైరల్ గా మారింది.మరణించిన వ్యక్తికి కాల దేవుడు ప్రత్యక్షమై మరో అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనే ఆసక్తికర పాయింట్ తో సముద్రఖని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్లు కేతిక శర్మ ప్రియా వారియర్ నటించిన సంగతి తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

The Land Titling Act: ఏపీ ఓటర్లకు అలర్ట్.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తెలుసుకుని ఓటేస్తే బెటర్!

The Land Titling Act: ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వము...
- Advertisement -
- Advertisement -