Samantha: షాకింగ్ నిర్ణయం తీసుకున్న సమంత.. ఆందోళనలలో అభిమానులు!

Samantha: సమంత.. ఈ పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేనిది. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. అనంతరం పలు స్టార్ హీరోల సరసన వరుస ఆఫర్లు తన సొంతం చేసుకుంది.

ఇక సమంత తన అందంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. మరి సమంత క్రేజ్ కు బాలీవుడ్ లో కూడా పలు అవకాశాలు వచ్చాయి. పలు వెబ్ సిరీస్ లు చేస్తూ బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఇటీవల వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ ద్వారా ఈ ముద్దుగుమ్మ పాన్ ఇండియా స్థాయికి పరిచయమైంది.

ఈ పుష్ప సినిమా సమంతకు.. పాన్ ఇండియా స్థాయిలో వరుస సినిమా ఆఫర్లను సంపాదించి పెట్టింది. ప్రస్తుతం సమంత షూటింగ్ విషయంలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా పాన్ ఇండియా లెవెల్ కొన్ని బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తుంది. ఇక సమంత సోషల్ మీడియాలో కూడా యమా ఆక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ సోషల్ మీడియాలో పంచుకుంటుంది.

ఇదిలా ఉంటే రాజాగా సమంత ఒక విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. సమంత ఇప్పటినుంచి నటించే సినిమాల్లో గ్లామరస్ గా కనిపించకూడదు అని నిర్ణయం తీసుకుందట. అంతేకాకుండా లిప్ లాక్ సీన్లు చేయకూడదని పూర్తి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా తన నిర్ణయాలు డైరెక్టర్లు ఒప్పుకున్న తర్వాత ఆ సినిమా చేయడానికి సైన్ చేస్తాను అన్నట్లు సమంత అంటుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తుంది.

ఇక సమంత నిర్ణయం తెలుసుకున్న తన అభిమానులు.. మరో స్థాయిలో ఆలోచన చేస్తున్నారు. ఉన్నట్టుండి సమంత ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటి? అని విచార పడుతున్నారు. మరి ఈ విషయం గురించి సమంత ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -