Samantha: షాకింగ్ కామెంట్స్ చేసిన సమంత.. అలాంటి పార్టనర్ కావాలంటూ?

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నా సమంత సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఇక సమంత సోషల్ మీడియా వేదికగా సరైన పార్ట్నర్ కావాలని వెతుకుతున్నట్లు పోస్ట్ చేశారు.

సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే సమంత రెండో పెళ్లి కోసమే లైఫ్ పార్ట్నర్ ని వెతుకుతున్నట్టు పోస్ట్ చేశారు. అయితే లైఫ్ పార్ట్నర్ తనకు కాదని తన బెస్ట్ ఫ్రెండ్ డాక్టర్ జెవెల్ గమాడియాకు మంచి జోడీ కోసం వెతుకున్నారు సామ్. తన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తనకు ఒక మంచి జోడి కావాలని కామెంట్ చేశారు.

 

అతడి లక్షణాలు చూచాయగా చెప్పారు. చాలా తెలివైనవాడని, గమాడియాకు జోడీ కావాలని సమంత తన పోస్ట్​లో రాసుకొచ్చారు. ఇక ఈయన వద్ద ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ కూడా ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే తాజాగా సమంత చేసిన ఈ పోస్ట్ చూస్తే ఆయన వద్ద సమంత కూడా ట్రీట్మెంట్ తీసుకుంటుందని అర్థం అవుతుంది.

 

ఇలా డాక్టర్ కోసం ఫర్ఫెక్ట్ మ్యాచ్ కావాలని సమంత చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక సమంత సినిమాల విషయానికొస్తే శాకుంతలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా డిజాస్టర్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈమె సిటాడెల్ వెబ్ సిరీస్ తో పాటు విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -